Bandh : 4న దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌

పేపర్‌ లీకేజీలను నిరసిస్తూ జులై 4న దేశ వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌ కు ఎస్‌ఎఫ్ఐ, ఏఐఎస్‌ఎఫ్‌, పీడీఎస్‌యూ వంటి వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. బంద్‌కు అన్ని విద్యా సంస్థల యాజమాన్యాలు సహకరించాలని కోరాయి.

New Update
Bandh : 4న దేశవ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌

Bandh Of Educational Institutions : పేపర్‌ లీకేజీ (Paper Leakage) లను నిరసిస్తూ జులై 4న దేశ వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌ కు ఎస్‌ఎఫ్ఐ (AISF), ఏఐఎస్‌ఎఫ్‌, పీడీఎస్‌యూ వంటి వామపక్ష విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. బంద్‌కు అన్ని విద్యా సంస్థల యాజమాన్యాలు సహకరించాలని కోరాయి. నీట్‌, నెట్‌ పేపర్‌ లీకేజీలకు నిరసనగా దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ఆందోళనలు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.

పరీక్షల నిర్వహణలో విఫలమైన ఎన్‌టీఏ (NTA) ను రద్దు చేయాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ (Dharmendra Pradhan) రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు పట్టుబడుతున్నాయి. ఇవే డిమాండ్‌లతో జులై 4న దేశ వ్యాప్తంగా బంద్‌కు పిలుపునిచ్చాయి. ఇదిలా ఉంటే నీట్‌ అక్రమాలను నిరసిస్తూ మంగళవారం విద్యార్థి సంఘాలు పార్లమెంట్‌ మార్చ్‌ చేపట్టనున్నట్లు సమాచారం.

Also read: టీటీడీ ఈవో కీలక ఆదేశాలు..ఇక నుంచి ఆ కష్టాలు తీరినట్లే!

Advertisment
Advertisment
తాజా కథనాలు