కొంపముంచిన పెళ్లి కొడుకు బట్టతల, అసలు ట్విస్ట్ ఇదే..

పీటల మీద పెళ్లిళ్లు ఆగిపోయిన ఘటనలు మనం చాలానే చూశుంటాం. ఏదో కారణంతో పెళ్లి మంటపాల్లో ఇరు వర్గాలు కొట్టుకున్న సందర్భాలు కోకొల్లలు అనే చెప్పాలి. తాజాగా బీహార్‌లో ఓ పెళ్లి ఆగిపోయింది. పెళ్లి కొడుక్కి బట్టతల ఉందని విగ్గు పెట్టుకున్నాడని తెలిసి కోపంతో రగిలిపోయారు. వధువు కుటుంబసభ్యులు. వరుడిపై మూకుమ్మడి దాడి చేసి చితకబాదారు. అంతేకాదు అతనికి ఇంతకుముందే పెళ్లైన విషయం తెలియడంతో వారి కోపం కాస్తా మరింత కట్టలు తెంచుకుంది. చివరకు పీటల మీద పెళ్లి ఆగిపోయింది.

New Update
కొంపముంచిన పెళ్లి కొడుకు బట్టతల, అసలు ట్విస్ట్ ఇదే..

బీహార్ రాష్ట్రంలోని కొత్వాలి పీఎస్ పరిధిలోని ఇక్బాల్‌నగర్‌కు చెందిన వ్యక్తికి గతంలోనే పెళ్లయింది. తాజాగా మరో యువతితో మ్యారేజ్‌కు రెడీ అయ్యాడు ఈ మహా కేటుగాడు. అయితే కాసేపట్లోనే పెళ్లి జరగాల్సి ఉంది. అంతలోనే పెనుతుఫాన్‌ చెలరేగింది. అంతలోనే అక్కడున్న పెళ్లి కొడుక్కి గతంలోనే మ్యారేజ్‌ అయిందన్న విషయం వధువు కుటుంబానికి తెలిసింది. ఇంకేముంది... ఆగ్రహంతో కట్టలు తెంచుకున్న బంధువులు ఊగిపోయారు.

మండపానికి చేరుకున్న వరుడితో వాగ్వాదం

వరుడిగా ముస్తాబై మండపానికి చేరుకున్న వరుడితో వాగ్వాదానికి దిగారు. మాయమాటలు, అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకుంటావా అంటూ చెంపలు పగులగొట్టి చితకబాదారు. ఇంకా బ్యాడ్ లక్‌ ఏంటంటే అదే సమయంలో వరుడి విగ్గు ఊడి కిందపడటంతో బట్టతల బండారం కాస్తా బయటపడింది. దీంతో మరింతగా రెచ్చిపోయారు. వరుడు పలుమార్లు నచ్చ చెప్పేందుకు ప్రయత్నించినా ఛాన్స్ లేకుండా వరుడి మాట వినకుండా చావ బాదేశారు.

తనను వదిలేయమని పెళ్లి కొడుకు ప్రాధేయపడినా

పెళ్లి కొడుకు తనను వదిలేయమని ప్రాధేయపడినా వదల్లేదు. వరుడి బంఢారం కాస్త బయటపడటంతో బంధువుల ఆగ్రహానికి బలయ్యాడు. ఈ తతంగం అంతా.. బీహార్‌ రాష్ట్రంలోని గయ జిల్లాలోని డోభీ ప్రాంతంలో జరిగిన ఈ ఘటన సోషల్‌ మీడియా వేదికగా తెగ వైరల్‌ అవుతూ దుమ్మురేపుతోంది. ఎంతేమైనా అతిగా ఆశపడి పెళ్లి మండపంలో భంగపాటుకు గురైనా ఘటనతో మనోడి భాగోతం అంతా పోలీసులు స్టేషన్‌కి తీసుకెళ్లి అసలు పెళ్లి చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు