Balapur Ganesh Laddu Auction 2023: బాలాపూర్ లడ్డూకు భలే డిమాండ్.. గత తొమ్మిదేళ్లుగా పలికిన ధరల వివరాలివే! బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలం రేపు జరగనుంది. గతేడాది అత్యధికంగా రూ.24.60 లక్షల రికార్డు ధర పలకడంతో ఈ సారి అంతకు మించి పలికే అవకాశం ఉంది. ఈ సారి రూ.30 లక్షలు దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. By Nikhil 27 Sep 2023 in తెలంగాణ హైదరాబాద్ New Update షేర్ చేయండి గణేశ్ నవరాత్రులు అనగానే తెలుగు రాష్ట్రాల్లోని భక్తుల్లో రెండు ఆసక్తికర ప్రశ్నలు మెదులుతూ ఉంటాయి. అందులో మొదటిది.. ఈ సారి ఖైరతాబాద్ గణేశుడి (Khirathabad Ganesh) ఎత్తు ఎంత?, రెండవది బాలానగర్ గణేశుడి లడ్డూ (Balapur Ganesh Laddu Price) ధర ఈ సారి ఎంత?. ఈ నేపథ్యంలో గణేశ్ నిమజ్జనం సందర్భంగా రేపు బాలాపూర్ లడ్డూ వేలం జరగనుంది. దీంతో ఈ సారి ధర ఎంత పలకవచ్చనే అన్న అంశంపై భక్తుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఇక్కడి లడ్డూను వేలంలో సొంతం చేసుకున్న వారికి కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలో వ్యాపారులు, రాజకీయ ప్రముఖులు సైతం వేలంలో పాల్గొనడానికి అత్యంత ఆసక్తి చూపుతుంటారు. ఈ వేలాన్ని చూడడానికి కూడా భక్తులు సైతం భారీగా తరలి వస్తుంటారు. గతేడాది అత్యధికంగా రూ.24.60 లక్షల రికార్డు ధర పలకడంతో ఈ సారి అంతకు మించి పలికే అవకాశం ఉంది. ఈ సారి బాలాపూర్ లడ్డూ ధర రూ.30 లక్షలు దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇది కూడా చదవండి: Khairatabad Ganesh: రేపు ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర సాగేది ఎలాగంటే..? 2014 నుంచి బాలాపూర్ లడ్డూను వేలంలో దక్కించుకున్న వారి పేర్లు, పలికిన ధర వివరాలు ఇలా ఉన్నాయి.. 2014- సింగిరెడ్డి జైహింద్ రెడ్డి - రూ.9.50 లక్షలు 2015- కళ్లెం మదన్ మోహన్ రెడ్డి - రూ.10.32 లక్షలు 2016- స్కైలాబ్ రెడ్డి - రూ.14.65 లక్షలు 2017- నాగం తిరుపతి రెడ్డి - రూ.15.60 లక్షలు 2018- శ్రీనివాస్ గుప్తా - రూ.16.60 లక్షలు 2019- కొలను రామిరెడ్డి - రూ.17.60 లక్షలు 2020 - కరోనా కారణంగా వేలం పాట జరగలేదు 2021 - మర్రి శశాంక్ రెడ్డి, రమేశ్ యాదవ్- రూ.18.90 లక్షలు 2022 -పొంగులేటి లక్ష్మారెడ్డి - రూ.24.60 లక్షలు My team of officers did the customary final route inspection for Ganesh immersion on 28 th , starting from Balapur-through old city - to the Hussainsagar lake . We checked out the road condition, the heights of the various flyovers , overhanging trees and wires Etc .The tour… pic.twitter.com/lgZZBjE62m — CV Anand IPS (@CVAnandIPS) September 26, 2023 ఇదిలా ఉంటే.. హైదరాబాద్ లో గణేశ్ నిమజ్జనం కోసం పోలీసులు, అధికారులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రత కోసం 25 వేల మంది పోలీసులను మోహరించారు. ఇప్పటికే ఈ మేరకు రూట్ మ్యాప్ ను కూడా విడుదల చేశారు. #ganesh-chaturthi-2023 #ganesh-nimajjanam-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి