Bhagavanth Kesari Review: భగవంత్ కేసరి.. హిట్టా !! ఫట్టా !! ట్విట్టర్‌లో ఫ్యాన్స్‌ ఏం అంటున్నారంటే?

'భగవంత్ కేసరి' సినిమాకు ఆడియన్స్ లో బాగా హైప్ క్రియేట్ అయ్యింది. భారీ అంచనాల మధ్య నేడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్‌లో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్‌ షో పడిపోయింది. ఇక సినిమా పై ప్రేక్షకుల నుంచి మిక్స్‌డ్‌ టాక్ వినిపిస్తుంది. ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా వాళ్ళ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. కొందరు సినిమా సూపర్ హిట్ అనగా, మరికొందరు యావరేజ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ సినిమాతో బాలయ్య హ్యాట్రిక్  కొట్టాడని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. 

New Update
Bhagavanth Kesari Review: భగవంత్ కేసరి.. హిట్టా !! ఫట్టా !! ట్విట్టర్‌లో ఫ్యాన్స్‌ ఏం అంటున్నారంటే?
Bhagavanth Kesari Review: బాలయ్య (Balakrishna), అనిల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేషన్ లో వచ్చిన 'భగవంత్ కేసరి'. ఈ సినిమాలో శ్రీలీల (Sreeleela) ఒక కీలక పాత్రలో నటించగా, కాజల్ (Kajal) హీరోయిన్ గా నటించారు. బాలయ్య నటించిన గత సినిమాల కంటే ఈ సినిమాలో బాలయ్య పాత్ర కాస్త బిన్నంగా ఉండబోతుందని మూవీ టీం మొదటి నుంచి చెప్పుకొచ్చింది. దీంతో బాలయ్య ఫ్యాన్స్ సినిమాలో బాలయ్య పాత్రను ఎలా చూపించారు అనే క్యూరియాసిటీ ఆడియన్స్ లో మొదలైంది.

ఆడియన్స్ లో కూడా ఈ సినిమా పై బాగా హైప్ క్రియేట్ అయ్యింది. భారీ అంచనాల మధ్య నేడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ఓవర్సీస్‌లో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్‌ షో పడిపోయింది. ఇక సినిమా పై ప్రేక్షకుల నుంచి మిక్స్‌డ్‌ టాక్ వినిపిస్తుంది. ప్రేక్షకులు ట్విట్టర్ (Twitter) ద్వారా వాళ్ళ అభిప్రాయాన్ని తెలుపుతున్నారు. కొందరు సినిమా సూపర్ హిట్ అనగా, మరికొందరు యావరేజ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Also Read: రతిక రీ ఎంట్రీ.. బిగ్ బాస్ ప్లాన్ ఇదేనా..!

సినిమా ఫస్ట్ హాఫ్ కాస్త ఫ్లాట్ గా ఉన్నా, ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయిందని అంటున్నారు. బాలయ్య డైలాగ్స్, యాక్షన్ సీన్స్ లో అదరగొట్టారని చెబుతున్నారు. ఫ్లాష్ బ్యాక్ లో బాలయ్య పోలీస్ ఆఫీసర్ గా కనిపించారు అయితే ఆ ఫ్లాష్ బ్యాక్ లో బాలయ్య గెటప్ బాగోలేదని కొందరు అంటున్నారు. ఇక సినిమా సెకండ్ హాఫ్ మొత్తం మాస్ ఎంటర్ టైనర్ అని అంటున్నారు. సినిమాలో శ్రీలీల క్యారెక్టర్ తన యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అని కామెంట్స్ పెడుతున్నారు. కొందరు ఈ సినిమాతో బాలయ్య హ్యాట్రిక్  కొట్టాడని కామెంట్స్ చేస్తున్నారు.

థమన్ (Thaman S) మ్యూజిక్ పై కూడా మిక్స్‌డ్‌ టాక్ వినిపిస్తుంది. ఇక బాలకృష్ణ సినిమాకు థమన్ మ్యూజిక్ అంటే అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి. ‘అఖండ’ సినిమాకు థమన్ ఇచ్చిన బీజీఎం ఎంత ప్లస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో ‘భగవంత్ కేసరి’కి (Bhagavanth kesari) కూడా కుమ్మేసి ఉంటాడని అంతా భావించారు. అయితే, కొందరు థమన్ నేపథ్య సంగీతంపై నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అంత బాగోలేదని అంటున్నారు. కానీ, కొందరు మాత్రం యాక్షన్ సీన్స్‌లో థమన్ అదరగొట్టారని కామెంట్లు పెడుతున్నారు.

Also Read: Allu Arjun: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు పై జర్నలిస్ట్ భరద్వాజ షాకింగ్ కామెంట్స్..?

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Raashii Khanna: రెడ్ బికినీలో రాశి గ్లామర్ షో.. నెట్టింట ఫొటోలు వైరల్

నటి రాశి ఖన్నా లేటెస్ట్ ఫొటోలు షేర్ చేసింది. రెడ్ స్విమ్ సూట్ లో రాశి హాట్ ఫోజులు సోషల్ మీడియాను హీటెక్కిస్తున్నాయి. ఈ ఫొటోలు మీరు చూశారా..?

New Update
Advertisment
Advertisment
Advertisment