చెప్పినమాట వినట్లేదని ఎంపీని సస్పెండ్ చేసిన బీఎస్పీ బీఎస్పీ ఎంపీ డానిష్ అలీని పార్టీ సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటంతోపాటు క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు పార్టీ నుంచి తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు బీఎస్పీ ప్రధాన కార్యదర్శి సతీశ్ చంద్ర మిశ్రా తెలిపారు. By srinivas 09 Dec 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి MP Danish Suspended : పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణంతో ఎంపీ డానిష్ అలీ(Danish Ali) ని బహుజన్ సమాజ్ పార్టీకి (BSP) సస్పెండ్ చేసింది. గతంలో జేడీఎస్‌లో ఉన్న డానిశ్ అలీ.. 2018 కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్, బీఎస్పీ పొత్తులో పోటీ చేశారు. ఫలితాల అనంతరం దేవెగౌడ సూచన మేరకు ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమ్రోహ సీటును బీఎస్పీ కేటాయించింది. 2019లో అమ్రోహ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో పాటు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న కారణంతో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు మిశ్రా తెలిపారు. అలీపై గతంలో భాజపా ఎంపీ రమేశ్ బిధూరీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో డానిష్ పేరు తెరపైకి వచ్చింది. అప్పట్లో విపక్ష పార్టీ నేతలు ఆయనకు అండగా నిలిచారు. రాహుల్ గాంధీ స్వయంగా ఆయనను కలిసి తన సంఘీభావం ప్రకటించారు. తాజాగా మహువా మొయిత్రాను సస్పెన్షన్‌ను అలీ తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో డానిష్ ‘పార్టీ విధానాలు, సిద్ధాంతాలు, క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు మౌఖికంగా పలుమార్లు హెచ్చరించినా.. పదే పదే పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించారు. అందుకే పార్టీ నుంచి తక్షణమే సస్పెండ్ చేస్తున్నాం’’ అని బీఎస్పీ ప్రధాన కార్యదర్శి సతీశ్ చంద్ర మిశ్రా తెలిపారు. ఇదే క్రమంలో 'డానిష్ అలీకి టిక్కెట్ ఇవ్వడానికి ముందు, బహుజన్ సమాజ్ పార్టీ విధానాలను ఎల్లప్పుడూ అనుసరిస్తానని, పార్టీ ప్రయోజనాల కోసం పని చేస్తానని హెచ్‌డీ దేవెగౌడ హామీ ఇచ్చారు. ఈ హామీకి డానిష్ కూడా అంగీకరించి ప్రమాణం చేశారు. ఆ తర్వాతనే అలీకి BSP సభ్యత్వం ఇచ్చాం' అని సతీశ్ పేర్కొన్నారు. Also read :విద్యార్థినిపై ఉపాధ్యాయుడు లైంగిక దాడి.. అడ్డొచ్చిన తండ్రి, సోదరుడిపై దారుణం అలాగే ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పార్టీ నుంచి విడుదల చేసిన ప్రకటనలో మాయావతి ఆరోపించారు. సెప్టెంబరు 2023లో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సందర్భంగా డానిష్ అలీపై బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత పలు ప్రధాన ప్రతిపక్ష పార్టీల నేతలు ఆయనకు మద్దతు పలికారు. టీఎంసీ నాయకుడు మహువా మొయిత్రాకు అనుకూలంగా డానిష్ అలీ కూడా పార్లమెంటు వెలుపల నిరసన తెలిపారు.ఈ ఏడాది సెప్టెంబర్‌లో చంద్రయాన్-3 మిషన్‌పై చర్చ సందర్భంగా బీజేపీ ఎంపీ రమేష్ బిధురి చేసిన వ్యాఖ్యలపై రాజకీయ దుమారం చెలరేగింది. ప్రధాని మోదీని కించపరిచే పదాలను ఉపయోగించారంటూ బీఎస్పీ ఎంపీ డానిష్ అలీని బీజేపీ ఎంపీలు లక్ష్యంగా చేసుకున్నారు. ఆయనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో బీజేపీ ఎంపీ బిధురికి షోకాజ్ నోటీస్ జారీకి దారితీసింది. అయితే గురువారం లోక్‌సభ ప్రివిలేజెస్ కమిటీ సమావేశంలో అలీపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ బిధురి విచారం వ్యక్తం చేశారు. #bsp #suspended #danish-ali #mp-danish-suspended మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి