తండ్రీ కొడుకులను బీఆర్ఎస్ విడదీసింది.. బాబూమోహన్ భావోద్వేగం

రాజకీయంగా తనను దెబ్బతీయడానికి బీఆర్ఎస్ తండ్రీకొడుకులను విడదీసిందని బీజేపీ అందోల్ ఎమ్మెల్యే అభ్యర్థి బాబుమోహన్ అన్నారు. ఎన్నికలకు ముందు మంత్రి హరీశ్ రావు తన కొడుకును పార్టీలో చేర్చుకున్నారని, అడిగితే తానే సీటును త్యాగం చేసేవాడినని చెప్పారు.

New Update
తండ్రీ కొడుకులను బీఆర్ఎస్ విడదీసింది.. బాబూమోహన్ భావోద్వేగం

Telangana Elections 2023: బీజేపీ నేత బాబూమోహన్ భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు. రాజకీయాలు తండ్రీకొడుకుల మధ్య దూరాన్ని పెంచాయంటూ ఆవేదన వ్యక్తంచేశారు. అధికార బీఆర్ఎస్ రాజకీయాల కోసం తండ్రీ కొడుకులను విడదీసిందంటూ బాబూమోహన్ (Babu mohan) భావోద్వేగానికి గురయ్యారు. ఆయన బీజేపీ తరఫున ఆందోల్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

ఇది కూడా చదవండి: రైతు బంధుకు ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్

తెలంగాణ సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని విస్తృతంగా బాబూమోహన్ ప్రచారం సాగిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం జరిగిన ఓ సమావేశంలో మాట్లాడుతూ ఒక్కసారిగా కంటతడి పెట్టారు. బీఆర్ఎస్ తన కొడుకును ఎన్నికలకు కొన్నిరోజుల ముందు పార్టీలోకి ఆహ్వానించి, కండువా కప్పేసిందన్నారు. మంత్రి హరీశ్ రావు (Harish Rao) తమ కుటుంబాన్ని విడదీశారని వాపోయారు. ఆ పార్టీ తండ్రీ కొడుకులను విడదీసి ఆనందం పొందుతోందంటూ విమర్శించారు. బాబూమోహన్ కుమారుడు ఉదయ్ ఐదు రోజుల క్రితం మంత్రి హరీశ్ రావు సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్న నేపథ్యంలో బాబూమోహన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

మంత్రి హరీశ్ రావు తనను ఓడించేందుకు కుట్రలు పన్నుతున్నారని, ఆందోల్ ప్రజలు తనవైపే ఉన్నారని బాబుమోహన్ అన్నారు. తాను కబ్జాలు చేసి కమిషన్లు తీసుకోలేదని ప్రజాసేవ కోసమే తాను రాజకీయాల్లో ఉన్నానని బాబుమోహన్ చెప్పారు. బీఆర్ఎస్ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని, తగిన బుద్ధి చెప్తారని అన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు