Ayodhya: అయోధ్య రామయ్యకు వజ్రాల కంఠహారం.. ఓ వజ్రాల వ్యాపారి కానుక.. గుజరాత్‌కు చెందిన ఓ రామ భక్తుడు అయోధ్య రామయ్యకు వజ్రాల కంఠహారాన్ని తయారు చేయించారు. 5వేల అమెరికన్ వజ్రాలతో దీనిని తయారు చేయించారు. రామాయణంలోని ముఖ్య పాత్రలను కళాకారులు ఈ హారంపై తీర్చిదిద్దారు. By Shiva.K 20 Dec 2023 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Ayodhya: అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఆలయ ప్రారంభోత్సవానికి ముహూర్తం దగ్గరపడుతున్నవేళ ఓ రామ భక్తుడు అయోధ్య రామయ్యకు వజ్రాల కంఠహారాన్ని తయారు చేయించారు. పూర్తి వివరాలోకి వెళితే.. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఓ వజ్రాల వ్యాపారి అయోధ్య రాముడికి 5వేల అమెరికన్ వజ్రాలతో కంఠహారం తయారు చేయించారు. రామాయణంలోని ముఖ్య పాత్రలను కళాకారులు ఈ హారంపై తీర్చిదిద్దారు. అయోధ్య రామమందిర ప్రారంభం సందర్భంగా ఈ హారాన్ని రాముడికి కానుకగా ఇవ్వాలనుకుంటున్నట్లు వజ్రాల వ్యాపారి కౌశిక్ కకాడియా తెలిపారు. 5వేల అమెరికన్ వజ్రాలను, 2 కిలోల వెండిని ఉపయోగించి 40 మంది కళాకారులు 35 రోజులు శ్రమించి ఈ హారాన్ని తయారు చేశారు. కంఠహారంపై అయోధ్య రామమందిర నమూనాతోపాటు రామాయణంలోని ముఖ్యపాత్రలను మలిచారు. వైభవంగా రామాలయ ప్రారంభోత్సవం.. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవాన్ని దేశ వ్యాప్తంగా పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అధిక సంఖ్యలో భక్తులు అయోధ్యకు చేరుకొనేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. రామ మందిరం ప్రారంభోత్సవం నాడు దేశ వ్యాప్తంగా ఆనంద్ మహోత్సవ్ నిర్వహణ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. భక్తుల రద్దీతో రైల్వే శాఖ దేశ వ్యాప్తంగా అయోధ్యకు వెయ్యి ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించింది. దేశం నలుమూలల నుంచి 1000 రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. భక్తులు అయోధ్యకు రాకపోకలు సాగించేందుకు వీలుగా ఆలయం ప్రారంభోత్సవానికి కొన్ని రోజుల ముందు.. జనవరి 19నుంచే ఈ సర్వీసులను అందుబాటులోకి తీసుకురానుంది. అలాగే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని అయోధ్య రైల్వేస్టేషన్‌లో ఆధునీకరణ పనులు చేపట్టారు. మరోవైపు అయోధ్యను సందర్శించే యాత్రికులకు 24గంటలూ కేటరింగ్ సేవలు అందించడానికి ఐఆర్‌సీటీసీ సన్నద్ధమైంది. కాగా, జనవరి 22న మధ్యాహ్నం 12గంటలకు శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుందని రామమందిర ట్రస్ట్ కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు. 4000 saints invited, Tent City established: Ayodhya gears up for consecration ceremony Read @ANI Story | https://t.co/wznm9nl4gh#Ayodhya #AyodhyaRamMandir #UttarPradesh pic.twitter.com/YnFhDcuytA — ANI Digital (@ani_digital) December 20, 2023 Also Read: ప్రతీ ‘పథకం’ సంచలనమే.. ఏపీ ప్రజలకు చంద్రబాబు ఎన్నికల వరాలు.. ప్రధాని కూడా అలాగే చేశారు.. ఎంపీ సంచలన కామెంట్స్.. #ayodhya #ayodhya-ram-mandir మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి