Ayodhya: అయోధ్యలో భారీ వర్షాలు.. జలమయమైన రామమందిరం!

అయోధ్యలో భారీ వర్షాలు కురుస్తున్నయి. దీంతో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. కొత్తగా నిర్మించిన రామ్ పథ్​ రోడ్డు కుంగిపోయింది. ఈ వర్షాలకు అయోధ్య రామమందిర గర్భగుడి పైకప్పు లీక్ అవుతున్నట్లు ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్‌ చెప్పారు.

New Update
Ayodhya: అయోధ్యలో భారీ వర్షాలు.. జలమయమైన రామమందిరం!

Ayodhya rains : అయోధ్యలో శనివారం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నయి. దీంతో అనేక చోట్ల రోడ్లు జలమయమయ్యాయి. కొత్తగా నిర్మించిన రామ్ పథ్​ రోడ్డు కుంగిపోయింది. అంతేకాదు రామ్​ పథ్ కు దారి తీసే 13 రోడ్లు జలమయం అయ్యాయి. అనేక ఇళ్లల్లోకి డ్రైనేజ్​ నీరు చేరుకుంది. వెంటనే చర్యలు చేపట్టిన అధికారులు.. డ్రైనేజ్​ నీటిని తొలగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. అనేక బృందాలను ఇంటింటికీ పంపిస్తున్నామని, ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అయోధ్య మేయర్​ గిరీశ్​ పాటి త్రిపాఠి తెలిపారు.

ఇదిలాఉంటే.. అయోధ్య రామమందిర నిర్మాణంలో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. గర్భగుడి పైకప్పు లీక్ అయినట్లు పూజారులు తెలిపారు. చిన్న వర్షానికే పైనుంచి నీరు కారుతుందని ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్‌ చెప్పారు. ఈ మేరకు మందిరాన్ని ప్రారంభించిన తర్వాత మొదటిసారి శనివారం రాత్రి భారీ వర్షం పడటంతో లీకేజీ సమస్య వెలుగులోకి వచ్చిందన్నారు. రామ్‌లల్లా విగ్రహానికి ఎదురుగా పూజారి కూర్చునే, వీఐపీలు దర్శనం చేసుకునే చోట నీరు కారుతున్నట్లు దాస్‌ చెప్పారు.

ఇది కూడా చదవండి: Afghanistan in Semis: సెమీస్ లో ఆఫ్ఘనిస్తాన్.. సోషల్ మీడియాలో ప్రశంసల వెల్లువ!

ఈ మేరకు ఆలయ నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహారించారని, ఆలయ ప్రాంగణం నుంచి వర్షపు నీరు పోయేందుకూ సరైన ఏర్పాట్లు లేవంటూ ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు ఈ సమస్యపై స్పందించి చర్యలు చేపట్టాలని కోరారు. అయితే ఈ విషయం తెలియగానే ఆలయానికి చేరుకున్న ఛైర్మన్‌ నృపేంద్ర మిశ్ర.. పైకప్పుని వాటర్‌ప్రూఫ్‌గా మార్చేలా మరమ్మతు పనులు చేయాలని సూచించినట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి. మొదటి అంతస్తు పనులు జులై వరకూ, మొత్తం ఆలయ నిర్మాణం డిసెంబరు నాటికి పూర్తిచేస్తామని ఆయన స్పష్టం చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు