Ayodhya Ram Mandir: రామ్ లల్లా విగ్రహం మారిపోయింది..శిల్పి అరుణ్ యోగిరాజ్ సంచలన వ్యాఖ్యలు! అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట చేసిన రామ్ లల్లా విగ్రహం..నేను తయారు చేసిన విగ్రహాం ఒకటేనా అనే సందేహం వచ్చిందంటూ శిల్పి అరున్ యోగిరాజ్ అన్నారు. ప్రాణప్రతిష్ఠ జరిగిన తరువాత బాలరాముని విగ్రహం మొత్తం మారిపోయిందని పేర్కొన్నారు. By Bhavana 26 Jan 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Ayodhya Ram Lalla Idol: అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం తరువాత బాల రామున్ని చూసిన శిల్పి అరుణ్ (Arun Yogi Raj) యోగి రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేను చెక్కిన శిల్పం అది కాదు ..బాల రాముడు మొత్తం మారిపోయాడంటూ చెప్పుకోచ్చాడు. కర్ణాటక మైసూర్ కు చెందిన శిల్పి యోగిరాజ్ అయోధ్యలో ప్రాణ ప్రతిష్ట (Ayodhya Ram Pran Pratishtha) కార్యక్రమం జరిగిన సమయంలో స్వామి వారు పూర్తి అలంకార భూషితుడై నేను మలచిన తీరుకు పూర్తి భిన్నంగా కనిపించాడంటూ చెప్పుకొచ్చారు. బాల రాముని విగ్రహాన్ని (Ram Lalla Idol) చూసి ఇది నేను చేసిన శిల్పమేనా అనే అనుమానం వచ్చిందని అనుకున్నాను. ఇది నా పని తీరులా లేదని నేనే అనుకున్నాను. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగిన తరువాత రాముల వారు వివిధ రూపాల్లో నాకు కనిపించారంటూ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అరుణ్ పేర్కొన్నాడు. '' స్వామి వారిని పూర్తి అలంకరణలో చూసిన తరువాత స్వామి వారి ముఖం పూర్తిగా మారిపోయింది. పూర్తి భిన్నంగా కనిపించారు. నాకే ఈ విగ్రహం నేను చెక్కినది కాదు అని అనుకున్నాను. వివిధ దశలలో వివిధ రూపాల్లో స్వామి వారు కనిపించారని శిల్పి అరుణ్ యోగిరాజ్ అన్నారు. శిల్పం చెక్కే సమయంలో రాముడు నాకు ఆదేశాలు ఇచ్చాడు. ఆ ఆదేశాల ప్రకారమే నేను స్వామి వారిని తయారు చేశాను అంటూ చెప్పుకొచ్చాడు. "నా లల్లా నాకు ఆజ్ఞ ఇచ్చాడు, నేను దానిని అనుసరించాను (రాముడు నాకు ఆజ్ఞ ఇచ్చాడు మరియు నేను దానిని అనుసరించాను)" అని యోగిరాజ్ చెప్పారు. విగ్రహాన్ని పూర్తి చేయడానికి నాకు సుమారు 7 నెలల సమయం పట్టింది. అది నాకు చాలా సవాలు తో కూడుకున్న సమయం. ఐదు సంవత్సరాల బాల రాముడిని తయారు చేయడం ఎంతో కష్టతరమైన పని . విగ్రహం శిల్ప శాస్తానికి కట్టుబడి ఉండేలా చూసుకోవాలని యోగిరాజ్ వివరించారు. '' ఓ రాయిలో భావం తీసుకుని రావడం అంత సులభమైన పని కాదు. రాముల వారి కళ్ల గురించి తన స్నేహితులను అడిగేవాడని యోగిరాజ్ పేర్కొన్నాడు. ఒక భావాన్ని శిల్పంలో తీసుకుని రావడం అంటే మాటలు కాదు. కాబట్టి పిల్లలతో ఎక్కువ సమయం గడపాలని నిర్ణయించుకున్నాను. మిగతాదంతా రామ్ లల్లా వల్ల జరిగింది." అంటూ అరుణ్ వివరించారు. Also read: హనీమూన్ అని చెప్పి అయోధ్యకు తీసుకెళ్లాడు..నాకు విడాకులు కావాలి! #ayodhya #ayodhya-ram-mandir #ram-lalla-idol #arun-yogi-raj మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి