AP: ఆటో డ్రైవర్ హల్చల్.. గ్యాస్ సిలెండర్తో పెట్రోల్ బంక్ తగల పెట్టేస్తానంటూ.. విశాఖ జిల్లాలో ఓ ఆటో డ్రైవర్ హల్చల్ చేశాడు. గ్యాస్ సిలెండర్తో పెట్రోల్ బంక్ తగల పెట్టేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. ఒక కేసు విషయమై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని, అందుకే బంక్ తగల పెట్టేస్తానంటూ హడావుడి చేశాడు. స్థానికుల సహాయంతో డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. By Jyoshna Sappogula 31 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Vishaka: విశాఖ జిల్లాలో సింహాద్రి అప్పన్న గోశాల బంక్ వద్ద ఓ ఆటో డ్రైవర్ హల్చల్ చేశాడు. గ్యాస్ సిలెండర్తో పెట్రోల్ బంక్ తగల పెట్టేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో అక్కడ ఉన్న సిబ్బంది, వాహన చోదకులు భయంతో పరుగులు తీశారు. ఈ మధ్య పోలీసు స్టేషన్ లో ఒక కేసు విషయమై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని, అందుకే ఇక్కడ బంక్ తగల పెట్టేస్తానంటూ హడావుడి చేశాడు. Also Read: కడపలో అమానుషం.. కుమార్తె చేతులపై వాతలు పెట్టిన కసాయి తల్లి..! ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో ఆటో డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ మా దేవుడని.. లా అండ్ ఆర్డర్ ఎవరికింద పనిచేస్తోందో తెలుసుకోవాలనే ఈ పనిచేశానని అంటున్నాడు ఆటో డ్రైవర్ రోలెక్స్ రాజు. గ్యాస్ సిలిండర్ తో ఆటో డ్రైవర్ హల్చల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. #vishaka సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి