ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలో విషాదం నెలకొంది. నలుగురు యువకులు ఈతకు వెళ్లారు. ఇందులో ఒక యువకుడు గల్లంతు అవ్వడంతో వెంకటాపురం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వీరంతా ఏలూరు శ్రీచైతన్య కాలేజీలో ఇంటర్ చదువుతున్న విద్యార్థులుగా గుర్తించారు. గల్లంతైనా బాలుడి కోసం రెస్క్యూ టీం గాలింపు చర్యలు చేపట్టారు.

Shareef Pasha
వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తుండడంతో వరంగల్ జిల్లాలోని ప్రముఖ దేవాలయం అయినటువంటి భద్రకాళీ దేవాలయానికి ఆనుకొని ఉన్న భద్రకాళీ చెరువుకు గండిపడింది. దీని కారణంగా భద్రకాళీ దేవాలయానికి సమీపంలో ఉన్నటువంటి పోతన్ నగర్, సరస్వతి నగర్ వాసులకు ప్రమాదం పొంచి ఉంది. దీనికారణంగా పోతన్ నగర్ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు బీజేపీ నాయకుల మధ్య స్వల్ప తోపులాట జరిగింది.
తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలకు మరికొన్ని నెలల గడువు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయడం, ఇవే చివరి కీలక సుదీర్ఘ సమావేశం కావడంతో అధికార ప్రతిపక్ష నేతల విమర్శలు, ప్రతివిమర్శలతో అసెంబ్లీ దద్దరిల్లనుంది. ప్రతిపక్ష నేతల మాటల తూటాలను సీఎం సైతం ఎదుర్కొనేందుకు అన్నివిధాలుగా సన్నద్ధం అయ్యారు. ఈనెల సోమవారం (31-07-2023) రోజున కేబినేట్ భేటీ కానుంది. ఇక వరదలు, మెడికల్ కాలేజీలకు సంబంధించిన పలు అంశాలపై సీఎం చర్చించనున్నారు. ఇవే ప్రధాన అస్త్రాలుగా ప్రతిపక్షనేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నించి ఇరుకున పెట్టేందుకు సన్నద్దమయ్యారు.
గత కొద్దిరోజులుగా తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు,వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఆయా జిల్లాల్లో కురిసిన వర్షాలతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అయితే ఈ భారీ వర్షాల కారణంగా కొన్ని విషాదానికి గుర్తులుగా మిగిలిపోయాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా వచ్చిన వరదల కారణంగా ఆస్తి నష్టంతో పాటు ప్రాణనష్టాన్ని మిగిల్చాయి. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతమైన ములుగు జిల్లాలో పదుల సంఖ్యలో జనం వరదలో గల్లంతయ్యారు ఇందులో ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో జిల్లావ్యాప్తంగా విషాదఛాయలు నెలకొన్నాయి.
ఇటీవల చాలామంది ఫోనుతోనే కాలక్షేపం చేస్తున్నారు. సోషల్ మీడియాలో తలదూర్చిన కొంతమంది మాత్రం పక్కన పెద్ద పిడుగుపడినా పట్టించుకోరు వీళ్లు. అంతలా ఫోన్లకు కనెక్ట్ అయిపోతున్నారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చాలామందికి చాలా క్రేజ్ వస్తోంది. దీనికి చదువు, అనుభవం పెద్దగా అక్కర్లేదు. కేవలం టాలెంట్ ఉంటే చాలు. కానీ ఇక్కడ ఐఫోన్ కోసం ఎవరు చేయని దారుణానికి తల్లిదండ్రులు ఒడిగట్టారు.ఏకంగా కన్న కొడుకునే అమ్ముకున్నారు. ఈ దారుణ ఘటన పశ్చిమబెంగాల్‌లో చోటుచేసుకుంది.
ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ (Justice Dheeraj Singh Takor) శుక్రవారం (28-07-2023) రోజున ప్రమాణ స్వీకారం చేశారు.జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్‌తో ఏపీ గవర్నర్ (AP Governor) అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయించారు.ప్రమాణం చేసిన అనంతరం నూతన ప్రధాన న్యాయమూర్తికి పుష్పగుచ్ఛం ఇచ్చి గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు.జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్‌ను శాలువా పుష్పగుచ్ఛంతో సీఎం జగన్ (CM Jagan) సన్మానించారు.
మళయాల హీరో మోహన్‌లాల్ టాలీవుడ్‌లో ఎన్టీఆర్ నటించిన జనతాగ్యారేజీ సినిమాలో నటించి అందరిని అబ్బురపరిచాడు. ప్రస్తుతం తన వయస్సు 63 ఏళ్లు. అయితేనేం ఏజ్ తన బాడీకే కానీ తన మనసుకు కాదంటూ ఈ వయసులోనూ తగ్గేదేలే అంటూ కుర్రాళ్లకు సవాల్ విసురుతున్నాడు.ఏకంగా 100 కిలోల బరువును ఎత్తి ఫ్యాన్స్‌ని విస్మయానికి గురిచేశాడు.ప్రస్తుతం తాను జిమ్‌లో చేసిన కసరత్తులకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతుంది.ఫిట్‌నెస్‌పై అతనికి ఉన్న డెడికేషన్‌కి అందరూ షాక్ అవుతున్నారు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.వరంగల్ ఖాజీపేట రైల్వే స్టేషన్లో ప్లాట్‌ఫాం ఎత్తువరకు వరద నీరు వచ్చి చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.వరదల కారణంగా పలు మార్గాల్లో రైళ్ళు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మూడు నెలలుగా జాతి ఘర్షణలు కొనసాగుతున్నా కేంద్రప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడాన్ని విపక్ష కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు.అధికారం కోసం బీజేపీ మణిపూర్‌ను తగులబెట్టేందుకు సిద్దమవుతోందని విమర్శించారు.అలాగే మణిపూర్‌లో హింసపై బీజేపీకి కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదంటూ మండిపడ్డారు.ఇదే అంశంపై పార్లమెంటులో అవిశ్వాస తీర్మానానికీ నోటీసు ఇచ్చామని తెలిపారు.
టెస్ట్ సిరీస్‌ను నెగ్గిన ఉత్సాహంతో టీమ్ ఇండియా వన్డే సిరీస్ కోసం రంగంలోకి దిగనుంది.భారత్ - వెస్టిండీస్ (IND Vs WI) జట్ల మధ్య మరో సిరీస్ స్టార్ట్ కానుంది.ఈ సమరంలో వెస్టిండీస్‌ని ఎదుర్కొనేందుకు భారత్ అన్నివిధాలుగా సన్నద్ధమైంది.మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా బుధవారం (27-07-2023) బ్రిడ్జ్‌టౌన్‌లోని బార్బడోస్ వేదికగా తొలి వన్డే మ్యాచ్ జరగనుంది.టెస్టు సిరీస్ విజయంతో విండీస్ పర్యటనను ప్రారంభించిన టీమ్‌ఇండియాకు ఇప్పటివరకు పెద్దగా పోటీ ఎదురుకాలేదు.విండీస్‌ని కొట్టేందుకు భారత్ పోరు కొనసాగించనుంది.
/rtv/media/media_files/2025/04/11/FYrbYWW3sl8dYie7a1fG.jpg)