అదృష్టం వల్లే 2023 వరల్డ్ కప్ ఆస్ట్రేలియా గెలిచింది..విక్రమ్ రాథోడ్!

2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ లో ఆస్ట్రేలియా విజయం పై అప్పటి టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ రాథోడ్ తాజాగా స్పందించారు. కేవలం ఆస్ట్రేలియా అదృష్టం వల్లే కప్ సాధించిందని వారు పేర్కొన్నారు. పిచ్ తమకు అనుకూలంగా సిద్ధం చేసుకున్నారనే విమర్శల్లో ఎలాంటి వాస్తవం లేదని ఆయన వెల్లడించారు.

New Update
అదృష్టం వల్లే 2023 వరల్డ్ కప్ ఆస్ట్రేలియా గెలిచింది..విక్రమ్ రాథోడ్!

17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్‌ను భారత్‌ గెలుచుకున్నప్పటికీ, 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ లో  ఆస్ట్రేలియా పై ఓడిపోవటం ఇంకా అభిమానుల మెదడులో మెదులుతూనే ఉంది. 2023 వరల్డ్ కప్ రోహిత్ శర్మ సారధ్యంలో వరుసగా పది మ్యాచ్‌లు గెలిచి ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. దీనిపై తాజాగా అప్పటి భారత జట్టు బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహిరించిన విక్రమ్ రాథోడ్ స్పందించాడు.

అదృష్టం వల్లే ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించిందని విక్రమ్ రాథోడ్ అన్నారు. వరల్డ్‌కప్‌ ఫైనల్స్‌ లో పిచ్‌ని మనకు అనుకూలంగా మార్చుకున్నామని చాలా మంది విదేశీయలు విమర్శలు చేశారు. దాంట్లో ఏ మాత్రం నిజం లేదు. నేను దానికి కొంచెం కూడా అంగీకరించను. ఫైనల్‌లో ఎవరూ ఊహించని విధంగా పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారింది. కానీ పిచ్ తడిగా మారుతుందని మేము ఊహించాము. కానీ అలా జరగలేదు. అది ఎలా జరిగిందో ఇప్పటికీ తెలియదు. ముందుగా బ్యాటింగ్ చేసినా మరికొంత పరుగులు చేసాము కానీ ఇంకొన్ని పరుగులు చేయాల్సి ఉండాల్సింది. అయితే ఒక్క విషయం మాత్రం ముఖ్యంగా చెప్పాలి. ఇలాంటి సిరీస్‌లు గెలవాలంటే అదృష్టం చాలా ముఖ్యం. ఫైనల్ రోజు మనకంటే ఆస్ట్రేలియాకే ఎక్కువ అదృష్టం వచ్చింది. అంతేకాదు ఆ రోజు ఆస్ట్రేలియా మనకంటే మెరుగ్గా క్రికెట్ ఆడింది. అందుకే వారు సక్సెస్ అయ్యారని  విక్రమ్ రాథోడ్ అన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు