Health Tips : అతి శ్రద్ద కూడా ఆరోగ్యానికి పెనుముప్పే!

ప్రొటీన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో కాల్షియం లోపం ఏర్పడుతుంది. కాల్షియం లోపం ఎముకల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అంటే కీళ్ల నొప్పులు వంటి సమస్యలకు ప్రొటీన్ అధికంగా తీసుకోవడం ప్రధాన కారణం కావచ్చు.

New Update
Health Tips : అతి శ్రద్ద కూడా ఆరోగ్యానికి పెనుముప్పే!

Attention : అతి సర్వత్రా వర్జయేత్‌.. అని పెద్దలు ఊరికే అనలేదు.శరీరం మీద తీసుకునే అతి శ్రద్ద కూడా ఆరోగ్యం (Health) పై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది.
శరీరానికి తగ్గట్లే డైట్ ప్లాన్ చేసుకోవాలి. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం చాలా ప్రయోజనకరమనే విషయం తెలిసిందే. కానీ అవసరమైన దానికంటే ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటే, ఆరోగ్యం చాలా దెబ్బతింటుందని మీకు తెలుసా?

గుండె సంబంధిత వ్యాధులు 

అధిక ప్రోటీన్ కారణంగా అనేక గుండె సంబంధిత వ్యాధుల (Heart Diseases) బారిన పడాల్సి ఉంటుంది. అధిక ప్రోటీన్ గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. కాబట్టి, సరైన సమయంలో సరైన పరిమాణంలో ప్రోటీన్ తీసుకోవాలి.

కాల్షియం లోపం తలెత్తవచ్చు
ప్రొటీన్ (Protein) ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో కాల్షియం లోపం ఏర్పడుతుంది. కాల్షియం లోపం ఎముకల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అంటే కీళ్ల నొప్పులు వంటి సమస్యలకు ప్రొటీన్ అధికంగా తీసుకోవడం ప్రధాన కారణం కావచ్చు. ఎముకలను బలహీనం చేయకూడదనుకుంటే, ఆహారంలో సరైన మొత్తంలో ప్రోటీన్‌ను చేర్చుకోవాలి. ఇది కాకుండా, అధిక ప్రోటీన్ తీసుకోవడం క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.

కిడ్నీ వ్యాధిని ఆహ్వానిస్తాయి
ప్రొటీన్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీ సంబంధిత వ్యాధులు కూడా రావొచ్చు.కిడ్నీలో రాళ్ల వంటి ప్రమాదకరమైన వ్యాధితో బాధపడవలసి రావచ్చు. రోజుకి ఎంత ప్రొటీన్ తీసుకోవాలో తెలుసా? వాస్తవానికి, నిపుణుల అభిప్రాయం ప్రకారం, ప్రోటీన్ తీసుకోవడం వ్యక్తి బరువుపై ఆధారపడి ఉంటుంది. ఇది కాకుండా, వయస్సు, శారీరక శ్రమ వంటి అంశాలు కూడా ప్రోటీన్ తీసుకోవడం మొత్తాన్ని ప్రభావితం చేస్తాయి.

Also read: రేపు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం!

Advertisment
Advertisment
తాజా కథనాలు