AP Elections: ఇలాంటి దాడులకు భయపడను: అంబటి

నిన్న తెలంగాణలో తనపై జరిగిన యాక్సిడెంట్‌కు, తర్వాత జరిగిన దాడికి సంబంధం ఉందనే అనుమానం వ్యక్తం చేశారు ఏపీ మంత్రి అంబటి రాంబాబు. ఇలాంటి దాడులకు భయపడే ప్రసక్తే లేదన్నారు.

New Update
Andhra Pradesh: పవన్‌కు అది అలవాటే.. మంత్రి అంబటి సెన్సేషనల్ కామెంట్స్..!

ఇటీవల తన మీద జరిగిన దాడిపై ఆర్టీవీతో మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. తెలంగాణలో ఎంగేజ్‌మెంట్ కార్యక్రమం కోసం వెళ్ళానని తెలిపారు. కారు ప్రమాదం జరిగింది కానీ ఎలాంటి ఇబ్బంది కలగలేదన్నారు. కానీ బస చేసిన హోటల్‌లో టీడీపీ కార్యకర్తలు తన మీద దాడి చేసే ప్రయత్నం చేశారని అంబటి చెప్పారు. నన్ను వేసేస్తాం... అంటూ పచ్చి బూతులు మాట్లాడారని చెప్పారు. చందాలు వేసుకుని తనను లేపేస్తాం.. అంటూ మాట్లాడారని మంత్రి తెలిపారు. గతంలో ఇదే ఖమ్మంలో ఒక సామాజిక వర్గం వారు మీటింగ్ పెట్టుకుని రూ.50 లక్షలు చందాలు వేసుకుని తన మీద దాడులు చేయాలని మాట్లాడారని ఆయన గుర్తు చేశారు.

ఇలాంటి దాడులు చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని అంబటి తెలిపారు. ఇదే కుల అహంకారంతో గతంలో వంగవీటి రంగాను పొట్టన పెట్టుకున్నారని గుర్తు చేశారు. ఇలాంటి దాడులకు తాను భయపడే వ్యక్తిని కాదని తేల్చిచెప్పారు. తాను చేతులు కట్టుకుని కూర్చొనే రకం కాదని వార్నింగ్‌ ఇచ్చారు. నిన్న జరిగిన యాక్సిడెంట్‌ కు తన మీద జరిగిన దాడికి సంబంధం ఉందనే అనుమానం కలుగుతుందని అంబటి ఆరోపించారు. దీని మీద విచారణ జరపాలని పోలీసులను ఆయన కోరారు. ఇప్పటికే పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారని మంత్రి చెప్పారు.

చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్‌ను సరెండర్ చేస్తే మొత్తం వాస్తవాలు బయటకు

ఈ కేసులో ఆగుగురిని అరెస్ట్ చేశారని అంబటి తెలిపారు. గన్ మెన్ లేకపోతే తన పరిస్థితి ఏంటి..? అని అన్నారు. ఇది కుట్ర ప్రకారం జరిగిన దాడేనని మంత్రి అనుమానం వ్యక్తం చేశారు. బెయిల్ కోసం చంద్రబాబు ఆరోగ్య సమస్యలు అంటూ డ్రామాలు ఆడుతున్నారని అంబటి రాంబాబు ఆరోపించారు. జైల్లో భద్రతకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. చంద్రబాబుకు బెయిల్ రావడానికి ఒకే అవకాశం ఉందన్నారు. అది చంద్రబాబు పీఏ పెండ్యాల శ్రీనివాస్‌ను సరెండర్ చేస్తే మొత్తం వాస్తవాలు బయటకు వస్తాయని ఆయన ధ్వజమెత్తారు. అప్పుడు చంద్రబాబుకు తప్పనిసరిగా బెయిల్ వస్తుందని అంబటి జోస్యం చెప్పారు.

ఇది కూడా చదవండి:  మద్యం మత్తులో కొడుకు ఘాతుకం… కన్నతల్లిని కడతేర్చిన కసాయి

Advertisment
Advertisment
తాజా కథనాలు