నిజామాబాద్ జిల్లా బోధన్‌లో దారుణం.. మర్మంగాన్ని కోసి హత్య మనుషుల్లో మానవత్వం అనేది రోజురోజుకు చచ్చిపోతోంది. మృగాల కంటే హీనంగా జనాలు తయారవుతున్నారు. క్రూర మృగాలు ఇతర జీవులను పీక్కు తిన్నట్టు సాటి మనిషి అని కూడా చూడకుండా దారుణంగా దాడి చేసి హతమారుస్తున్నారు. కొన్నిసార్లు అమానుషంగా మనుషుల అవయవాలను కోసేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. By Vijaya Nimma 24 Jul 2023 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి రాళ్లతో కొట్టి చంపేశారు ఓ యువకుడి మర్మాంగాన్ని కోసి హత్య చేశారు గుర్తుతెలియని దుండగులు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా బోధన్‌లో కలకలం రేపుతోంది. మృతుడిని మాజిత్ ఖాన్ బోధన్ పట్టణంలోని రెంజల్ బేస్‌కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. శక్కర్‌నగర్‌లోని ఓల్డ్ మధుమలాంఛ స్కూల్ సమీపంలో ఈ దారుణం చోటుచేసుకుంది. యువకుడిని విచక్షణ రహితంగా రాళ్లతో కొట్టి తీవ్రంగా గాయపరిచారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. మృతుడి అన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి పోలీసులు తరలించారు. తమ బిడ్డను దారుణంగా హత్య చేసిన దుండగులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. రెండు రోజుల క్రితం.. రెండు రోజుల కిత్రం ఏపీలో ఇలాంటి దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. నందిగామలోని అయ్యప్పనగర్‌లో మొదటి భార్య ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నాడని భర్త మర్మాంగాన్ని రెండో భార్య కోసేసింది. ఆనంద్‌బాబు వీడియోలు చూస్తుండగా, మొదటి భార్య వీడియోలు ఎందుకు చూస్తున్నావు అంటూ రెండో భార్య వరమ్మ ధ్వజమెత్తింది. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ చెలరేగింది. ఆ ఘర్షణ పెద్దదవ్వడంతో ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. ఆగ్రహానికి లోనైన వరమ్మ వెంటనే ఆనంద్‌బాబుపై బ్లేడుతో దాడి చేసి మర్మాంగాలను కోసేసింది. దీంతో ఆనందబాబుకు తీవ్ర రక్తస్రావం అయ్యింది. నొప్పితో విల విలలాడుతున్న అతడిని కుటుంబ సభ్యులు వచ్చి వెంటనే నందిగామ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అతన్ని విజయవాడకు తీసుకువెళ్లారు. ఇప్పటికైనా జనాల్లో మార్పు రావాలి ఇంత దారుణంగా మనుషులు ఎందుకు తయారవుతున్నారో ? కుటుంబ సంబంధాలు,మానవ సంబంధాలన్నింటిలోనూ విలువలు క్షీణిస్తున్నాయి. మనిషిని విచక్షణా రహితంగా చంపడం, అవయవాలు కోయడం వంటి దారుణాలకు పాల్పడుతున్నారంటే.. దానికి ఏది కారణమనుకోవాలి. నాగరికత పెరిగిందని, అభివృద్ధి సాధించామని చెబుతున్న మనిషి ఎందుకు పతనమవుతున్నాడో? ఎదుటివారిని చంపే అంత హక్కు వాళ్ళకి ఎవరు ఇచ్చారు..? ఎన్ని ప్రభుత్వాలు మారినా.. ఎన్ని చట్టాలు వచ్చినా.. ఎంత టెక్నాలజీ పెరిగినా.. మనిషిలో అమానుషత్వాన్ని పోగొట్టటానికి పరిష్కారం కనిపించటం లేదు. దీనివల్ల మనుషుల్లో అభద్రత పెరిగిపోతోంది. జీవితంలో మాత్రం మార్పు రావటం లేదు. ఓ వ్యక్తి ప్రాణానికి సేఫ్టీ అనేది లేకుండా పోయింది. ఇటువంటి సంఘటనలు పునారావృతం కాకుండా చూడాలని సభ్యసమాజం అంతా కోరుకుంటోంది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి