అగ్రరాజ్యంలో మరోసారి కాల్పుల కలకలం.... ముగ్గురి మృతి...!

తుపాకి మోతలతో అమెరికా మరోసారి దద్దరిల్లి పోయింది. సౌత్ ఈస్ట్ వాషింగ్టన్ లోని గుడ్ హోడ్ రోడ్డులోని 1600 బ్లాక్ లో దుండగుడు కాల్పులకు దిగాడు. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.

New Update
అగ్రరాజ్యంలో మరోసారి కాల్పుల కలకలం.... ముగ్గురి మృతి...!

తుపాకి మోతలతో అమెరికా మరోసారి దద్దరిల్లి పోయింది. సౌత్ ఈస్ట్ వాషింగ్టన్ లోని గుడ్ హోడ్ రోడ్డులోని 1600 బ్లాక్ లో దుండగుడు కాల్పులకు దిగాడు. ఈ ఘటనలో ముగ్గురు మరణించారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో కాల్పులు చోటు చేసుకున్నట్టు స్థానిక పోలీసు అధికారి పమేలా స్మిత్ తెలిపారు.

మృతుల్లో ఇద్దరు పురుషులు, ఒక మహిళ వున్నట్టు చెప్పారు. మరో ఇద్దరికి గాయాలు కాగా ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తన్నట్టు పేర్కొన్నారు. ఆ ఇద్దరి పరిస్థితి ఎలా వుందనే విషయాన్ని ఇప్పుడే చెప్పలేమన్నారు. దుండుగుడు ఎవరు, ఎందుకు కాల్పులు జరిపాడనే విషయం ఇంకా తెలియరాలేదన్నారు. ఈ ఘటనలో ఇంకా ఎవరైనా వున్నారా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నట్టు చెప్పారు.

ఆ ప్రాంతంలో పర్యాటకుల సందడి ఎక్కువగా వుంటుందని స్మిత్ వెల్లడించారు. పర్యాటకును భయాందోళనలకు గురి చేయాలనే ఆలోచనతోనే నిందితుడు కాల్పులు జరిపాడని తాము ప్రాధమికంగా అంచనా వేస్తున్నట్టు చెప్పారు. ఈ కాల్పుల్లో మరి కొందరికి కూడా గాయాలై వుండ వచ్చేని తాము భావిస్తున్నామని చెప్పారు. నగరంలో హింసను అరికట్టడంలో ప్రజల సహకారం ఉండాలన్నారు.

వాషింగ్టన్ డీసీలో ఇటీవల క్రైమ్ రేట్ పెరిగి పోయింది. గతేడాది నగరంలో హింసాత్మక ఘటనలు 37 శాతం పెరిగి పోయాయి. హత్యలు 21 శాతం పెరిగాయని నివేదికలు చెబుతున్నాయి. నగరంలో కాల్పుల ఘటనల్లో ఈ ఏడాది ఇప్పటి వరకు 150 మంది మరణించారు. రెండు దశాబ్దాల తర్వాత ఇంత తక్కువ కాలంలో ఇంత మంది కాల్పుల్లో మరణించడం ఇదే తొలిసారి అని స్థానిక పత్రికలు వెల్లడించాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు