Mali: దారుణం..దుండగుల కాల్పుల్లో 26 మంది మృతి!

ఫ్రికా దేశమైన మాలిలో దేశ సరిహద్దుల్లోని డెంబో గ్రామంలో పొలాల్లో పని చేసుకుంటున్న ప్రజలపై కొందరు దుండగులు ఒక్కసారిగా దాడి చేసి 26 మందిని చంపేసినట్లు అధికారులు పేర్కొన్నారు.ఇప్పటి వరకు ఈ దాడికి ఏ వర్గమూ బాధ్యత వహించలేదని అధికారులు తెలిపారు.

New Update
Mali: దారుణం..దుండగుల కాల్పుల్లో 26 మంది మృతి!

Mali: ఆఫ్రికా దేశమైన మాలిలో దేశ సరిహద్దుల్లోని డెంబో గ్రామంలో పొలాల్లో పని చేసుకుంటున్న ప్రజలపై కొందరు దుండగులు ఒక్కసారిగా దాడి చేసి 26 మందిని చంపేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఈ దాడికి ఏ వర్గమూ బాధ్యత వహించలేదని అధికారులు తెలిపారు. ఈ ప్రాంతంలో ఇటీవల ఇలాంటి దాడులు బాగా ఎక్కువ అయ్యాయని అధికారులు వివరించారు.

అయితే, సైన్యం సైతం ఇలాంటి దాడులను నిలువరించలేకపోతోందన్నారు. సాధారణంగా ఇక్కడి గ్రామీణ ప్రజలపై ఉగ్ర సంస్థ అల్‌ ఖైదాకు అనుబంధంగా పని చేసే జేఎన్‌ఐఎం గ్రూప్‌ దాడి చేస్తుంది.. ఈ నెలలోనే ఓ వివాహ వేడుకలో కూడా కొందరు ఉగ్రవాదులు దాడులు చేసి 21 మంది సామాన్య ప్రజలను పొట్టన బెట్టుకున్నారని అధికారులు చెప్పుకొచ్చారు.

తాజా దాడి కూడా వారి పనే అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.కాగా, మధ్య, ఉత్తర మాలిలో దాదాపు దశాబ్ద కాలంగా హింసాత్మక ఘటనలు జరుగుతునే ఉన్నాయి. ఉత్తర ప్రాంతంలోని నగరాల్లో ఒకప్పుడు అధికారంలో ఉన్న తీవ్రవాద ముఠాలను ఫ్రెంచ్ సైన్యం సహాయంతో దేశ భద్రతా బలగాలు తరిమికొట్టాయి. వారందరూ ఒక గ్రూపుగా ఏర్పడి గ్రామాలు, సైనికులపై తరచూ దాడులకు తెగబడుతున్నట్లు తెలుస్తుంది. ఈ ముఠాను అంతం చేసేందుకు సైనికులు కూడా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు.

Also read: భద్రాచలం దగ్గర గోదావరి మహోగ్రరూపం

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

ఎంత దారుణంగా చంపారంటే.. బయటకు వచ్చిన ఉగ్రదాడి ఫస్ట్ వీడియో!

జమ్మూ కాశ్మీర్‌లోని ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరుగుతున్న వీడియో బయటకు వచ్చింది. కేవలం పర్యాటకులను మాత్రమే టార్గెట్ చేసుకుని కాల్పులు జరిపారు. అందులో కూడా మతం, పేర్లు అడిగి మరి కాల్పులు జరిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

New Update

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 28 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే పహల్గామ్‌లో ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరుగుతున్న వీడియో బయటకు వచ్చింది. కేవలం పర్యాటకులను మాత్రమే టార్గెట్ చేసుకుని కాల్పులు జరిపారు. అందులో కూడా మతం, పేర్లు అడిగి మరి కాల్పులు జరిపిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

ఇది కూడా చూడండి: TG Crime: కోడలిపై మోజుతో కొడుకును లేపేసిన తండ్రి.. రోకలి బండతో కొట్టి చంపి!

ఇది కూడా చూడండి: Betting Apps Pramotion Case : ప్రభుత్వం సంచలన నిర్ణయం..సెలబ్రిటీ బెట్టింగ్ యాప్స్ కేసు సీఐడీకి బదిలీ

మొత్తం 28 మంది..

ఇదిలా ఉండగా మినీ స్విట్జర్లాండ్‌గా పేరుపొందిన పహల్గాంలోని బైసారన్‌ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 28 మంది టూరిస్టులు మృతి చెందగా.. మరో 20 మందికి పైగా గాయాలపాలయ్యారు. మృతుల్లో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు. వాళ్లలో ఒకరు నేపాలీ కాగా మరొకరు యూఏఈ. మిగతావారు భారత్‌లోని మహారాష్ట్ర, గుజరాత్, యూపీ, హర్యానా, బీహార్, కర్ణాటక రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు.  

ఇది కూడా చూడండి: Indus River Agreement: 64 ఏళ్ళ ఒప్పందానికి స్వస్తి..ఎడారిగా మారనున్న పాకిస్తాన

ఇది కూడా చూడండి: Sunstroke: వడదెబ్బకు ఏడుగురు మృతి.. మరో రెండ్రోజులు వడగాల్పులు

Advertisment
Advertisment
Advertisment