Laxmi Devi Idol: ఇంట్లో లక్ష్మీ దేవి విగ్రహం ఉందా...? ఈ 5 తప్పులు చేయకండి.! లక్ష్మీదేవిని సంపదకు దేవతగా భావిస్తారు. లక్ష్మీదేవి ఎక్కడ నివసిస్తుందో,అక్కడ సుఖ సంతోషాలు ఉంటాయని నమ్ముతారు. ఇంట్లో లక్ష్మీదేవి విగ్రహాన్ని తప్పు దిశలో ఉంచడం వల్ల ఆర్ధిక ఇబ్బందులకు దారితీస్తుంది. ఇంటికి ఈశాన్య దిశలో లక్ష్మీదేవి విగ్రహాన్ని ఉంచడం వల్ల శుభం చేకూరుతుంది. By Archana 17 Jun 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Laxmi Devi Idol: వాస్తు శాస్త్రం అనేది ఇంట్లో సానుకూల శక్తిని పెంచడానికి, ప్రతికూల శక్తిని దూరం చేయడానికి అనేక చర్యలు సూచించబడిన శాస్త్రం. కొన్ని సందర్భాల్లో చాలా మంది దేవుళ్ళ, దేవతల విగ్రహాలను తప్పు దిశలో లేదా తప్పు మార్గంలో ఉంచుతుంటారు. దాని కారణంగా ఇంట్లో ప్రతికూల శక్తి తిరుగుతుంది. లక్ష్మి దేవిని సంపదకు దేవతగా భావిస్తారు. లక్ష్మీదేవి ఎక్కడ నివసిస్తుందో, ఆ ఇంట్లో సుఖానికి, శ్రేయస్సుకు లోటు ఉండదని నమ్ముతారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం, లక్ష్మీ దేవి విగ్రహాన్ని ఇంట్లో ఏ దిశలో, ప్రదేశంలో, ఏ స్థానంలో ఉంచడం శుభప్రదమో ఇప్పుడు తెలుసుకుందాము.. ఇంట్లో ఎన్ని లక్ష్మీ దేవి విగ్రహాలను ఉంచాలి..? ఇంట్లో ఎప్పుడూ ఒకటి కంటే ఎక్కువ లక్ష్మీ దేవి విగ్రహాలను ఉంచకూడదు. ఒకటి కంటే ఎక్కువ విగ్రహాలు ఉండటం వల్ల ప్రతికూల శక్తి వ్యాపిస్తుంది. లక్ష్మీ దేవి విగ్రహాన్ని ఎల్లప్పుడూ గణేశుడితో పాటు ఉంచాలా..? సాధారణంగా, చాలా ఇళ్లలో, శ్రీ గణేశుడితో పాటు లక్ష్మీ దేవి విగ్రహాన్ని ఉంచుతారు. కానీ లక్ష్మీ దేవి విగ్రహాన్ని వినాయకుడి వద్ద మాత్రమే ఉంచాల్సిన అవసరం లేదు. లక్ష్మీ దేవత విగ్రహం విష్ణువు, కుబేరుడితో పాటు కూడా ప్రతిష్టించవచ్చు. వినాయకుడితో పాటు లక్ష్మీ దేవి విగ్రహం కుడి వైపున ఉంచాలి. కాగా, విష్ణుమూర్తితో పాటు లక్ష్మీ దేవి విగ్రహం ఎడమ వైపున ఉంచాలి. లక్ష్మీదేవి విగ్రహాన్ని ఎక్కడ ఉంచాలి..? ఇంటి గుడిలో లక్ష్మీ దేవి విగ్రహం ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి. ఎప్పుడూ కూడా లక్ష్మీ దేవి విగ్రహం నేలపై ఉంచకూడదని గుర్తుంచుకోండి. ఇంట్లో గుడి లేకుంటే టేబుల్ లేదా స్టూల్‌ను అమర్చి అమ్మవారి విగ్రహాన్ని ఉంచాలి. లక్ష్మీదేవి విగ్రహాన్ని ఏ దిశలో ఉంచాలి..? వాస్తు శాస్త్రం ప్రకారం, లక్ష్మీ దేవి విగ్రహాన్ని ఇంటికి ఈశాన్య దిశలో ఉంచడం వల్ల ఆనందం, శ్రేయస్సు పెరుగుతుంది. అదే సమయంలో, వాయువ్య కూడా దిశలో ఉంచవచ్చు. ఏ రకమైన లక్ష్మీ దేవి విగ్రహాన్ని ఇంట్లో ఉంచకూడదు..? లక్ష్మీ దేవి పద్మాసనంపై కూర్చుని ఉన్న విగ్రహానికి తీసుకురండి. లక్ష్మీమాత విగ్రహాన్ని నిలువెత్తు స్థితిలో ఉంచకూడదు. విగ్రహం లేదా పటాన్ని పగలగొట్టడం, కాల్చడం వంటివి చేయకూడదని గుర్తుంచుకోండి. ఇలా చేయడం అశుభంగా పరిగణించబడుతుంది. గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. Also Read: Paneer: ఈ సింపుల్ చిట్కాలతో.. కల్తీ పన్నీర్ ఏదో కనిపెట్టండి..! - Rtvlive.com #vastu-tips #laxmi-devi-idol మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి