Health Tips: ఈ నాలుగు ఆహారాలు తినండి.. ఆస్తమా నుంచి రిలీఫ్ పొందండి..

చలికాలం వచ్చిందంటే చాలు.. గుండె సంబంధిత, ఆస్తమా వ్యాధులతో బాధపడేవారు నరకం చూస్తారు. ముఖ్యంగా.. ఆస్తమా బాధితులు చలికాలంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆస్తమా సమస్య నుంచి బయటపడేందుకు మెడిసిన్స్ వాడుతుంటారు. అయితే, ఈ మెడిసిన్ కు బదులుగా మనం తినే ఆహారంలో కొన్ని ఆహారాలతో ఆస్తమాకు చెక్ పెట్టొచ్చని చెబుతున్నారు. అల్లం, అవకాడో, పాలకూర వంటి ఆహారాలను తినడం వల్ల ఆస్తమా నుంచి ఉపశమనం పొందవచ్చు.

New Update
Health Tips: ఈ నాలుగు ఆహారాలు తినండి.. ఆస్తమా నుంచి రిలీఫ్ పొందండి..

Asthma Diet: ఆస్తమా అనేది శ్వాసకోశ వ్యాధి. కానీ ఇది బాధిత వ్యక్తి ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తుంది. గుండె(Heart), ఊపిరితిత్తులపై(Lungs) దుష్ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా చలికాలంలో ఆస్తమా(Asthma) సమస్య మరింత పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బాధిత వ్యక్తుల గొంతులో శ్లేష్మం పేరుకుపోతుంది. దీని కారణంగా రోగి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. ఇలాంటి పరిస్థితిలో బాధిత వ్యక్తులు.. ఇన్హేలర్లు, మెడిసిన్స్ వాడాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే, ఆస్తమాను ఆహారం ద్వారా కూడా నియంత్రించవచ్చు. కొన్ని ఆహారాలు ఆస్తమా రోగులకు ఎంతో మేలు చేస్తాయని, వీటిని తినడం వల్ల ఆస్తమా సమస్య నుంచి చాలా వరకు ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మరి ఆ ఆహారాలేంటో ఓసారి తెలుసుకుందాం.

పాలకూర..

పాలకూరలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఆస్తమా రోగులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఉబ్బసంతో బాధపడుతున్న వ్యక్తులు పొటాషియం, మెగ్నీషియం వంటి మూలకాల లోపం కలిగి ఉంటారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది ఆస్తమా సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది. ఇలాంటి పరిస్థితిలో ఆస్తమా బాధితులు తినే ఆహారంలో బచ్చలి కూరను చేర్చుకోవచ్చు. ఇది చాలా వరకు ఉపమనం కలిగిస్తుంది.

నారింజ..

నారింజలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఒక పరిశోధన ప్రకారం.. విటమిన్ సి ఎక్కువగా తీసుకునే వారికి ఆస్తమా వచ్చే ప్రమాదం తక్కువ. విటమిన్ సి మన రోగనిరోధక వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతే కాకుండా ఆస్తమా నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.

అవకాడో..

అవకాడోలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు శరీరం నుండి విష పదార్థాలను తొలగించడంలో సహాయపడతాయి. ఆస్తమాతో బాధపడేవారు తప్పనిసరిగా ఆవకాడోను ఆహారంలో చేర్చుకోవాలి.

అల్లం..

పురాతన కాలం నుండి అల్లంను జలుబు, దగ్గు సమస్య నుంచి ఉపశమనం పొందడానికి ఉపయోగించడం జరుగుతుంది. అల్లం కూరల రుచిని పెంచడమే కాకుండా, ఆస్తమా రోగులకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్ నుండి గొంతును రక్షిస్తుంది. అల్లంలో తేనె కలుపుకుని గోరువెచ్చని నీటిని తాగవచ్చు. ఇది గొంతుకు చాలా ఉపశమనం ఇస్తుంది.

Also Read:

పదవి విరమణ తరువాత నెలవారీగా పెన్షన్ పొందాలనుకుంటున్నారా? ఈ పథకం బెస్ట్!

ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క నీటిని తాగితే 5 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..

Advertisment
Advertisment
తాజా కథనాలు