Ishwar Sahu: కొడుకు హత్యతో పగ.. ఏడు సార్లు గెలిచిన ఎమ్మెల్యేపై కూలీ విక్టరీ

చత్తీస్‌గఢ్ ఎన్నికల్లో ఓ సామాన్యుడి విజయం పెను సంచలనంగా మారింది. సాజా అసెంబ్లీ నియోజకవర్గంలో ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రవీంద్ర చౌబేపై ఈశ్వర్ సాహు అనే కూలీ గెలిచాడు. కుమారుడి హత్యతో కడుపుమండిన ఓ సామాన్యుడు సాధించిన విజయం ఇది.

New Update
Ishwar Sahu: కొడుకు హత్యతో పగ.. ఏడు సార్లు గెలిచిన ఎమ్మెల్యేపై కూలీ విక్టరీ

ఎవరీ ఈశ్వర్ సాహు?
చత్తీస్‌గఢ్‌లోని బీరాన్‌పూర్‌కి చెందిన ఈశ్వర్ సాహు దినసరి కూలీ. ఆయన పనికి వెళ్తేనే ఇంట్లో పూట గడుస్తుంది. అలాంటి కుటుంబంలో ఈ ఏడాది ఏప్రిల్‌లో విషాద సంఘటన చోటు చేసుకుంది. అల్లరి మూకల దాడిలో ఈశ్వర్ సాహు కొడుకు భువనేశ్వర్ సాహు దారుణ హత్యకు గురయ్యాడు. ఆ ఘటనతో ఈశ్వర్ సాహు రగిలిపోయాడు. కుమారుడి హత్యని ఆయన జీర్ణించుకోలేకపోయాడు. ఆఅదే సమయంలో స్థానికంగానూ ఈ హత్యపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ కేసు నడుస్తుండగానే ఎన్నికలు వచ్చాయి. దీంతో అనూహ్యంగా సాహుని, సాజా అసెంబ్లీ నియోజకవర్గంలో తమ అభ్యర్ధిగా బరిలోకి దించింది బీజేపీ. అదే నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి ఏడుసార్లు గెలిచిన రవీంద్ర చౌబే బరిలోకి దిగారు.

పంతం పట్టిన సాహు...
కుమారుడి హత్యకి పగబట్టిన ఈశ్వర్ సాహు... ఎన్నికల ప్రచారంలో ఇంటింటికి తిరిగాడు. తన కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాడు. డిసెంబర్ 3న వచ్చిన ఎన్నికల ఫలితాల్లో 5,527 ఓట్ల మెజారిటీతో రవీంద్ర చౌబేని మట్టి కరిపించాడు సాహు. ఈ విజయం దేశవ్యాప్తంగా ఇప్పుడు సంచలనంగా మారింది. ఓ సామాన్యుడు ఎన్నికల్లో గెలవడంపై అంతటా హర్షం వ్యక్తమౌతోంది. ఇది కదా అసలు సిసలైన ప్రజాస్వామ్యం అంటే అని, సోషల్ మీడియాలోనూ పలువురు పోస్టులు పెడుతున్నారు. ఈశ్వర్ సాహు విజయం మరెందరికో స్ఫూర్తినిస్తుంది అంటున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు