వచ్చే ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో పోటీ చేస్తామని ఓవైసీ కీలక ప్రకటన..! రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో మెజార్టీ స్థానాల్లో పోటీ చేస్తామని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో తాము కూడా ప్రత్యామ్నాయమేనని అన్నారు. ఇటీవల బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే షకీల్ ఫిర్యాదుతో అరెస్టయిన మజ్లిస్ నేతలను ఈరోజు నిజామాబాద్ జిల్లా జైలులో ఆయన కలిసిన అనంతరం ఓవైసీ ఈ వ్యాఖ్యలు చేయడంతో రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. By Shareef Pasha 26 Jun 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి వచ్చే ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో పోటీ చేస్తామన్న ఓవైసీ ఏ పార్టీతో ముందుకెళ్లాలనేది ఆలోచిస్తామని వెల్లడి ముస్లింలకూ ముస్లిం బంధు ఇవ్వాలని డిమాండ్ వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో మెజార్టీ స్థానాల్లో పోటీ చేస్తాం. ఎక్కడెక్కడ పోటీ చేస్తామనేది ఎన్నికల ముందు జాబితాను ప్రకటిస్తాం. బోధన్‌లోనూ పోటీ చేస్తాం. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే షకీల్‌కు తగిన బుద్ధి చెబుతాం అంటూ అసదుద్దీన్ ఓవైసీ హెచ్చరించారు. అరెస్ట్ అయిన ఎంఐఎం నేతలు.. ఎమ్మెల్సీ కవిత.. షకీల్ గెలుపు కోసం పనిచేశారని చెప్పారు. అయినా ముస్లీం మైనార్టీలకు న్యాయం జరగలేదని ఆయన బీఆర్‌ఎస్‌పై ఫైర్ అయ్యారు. తెలంగాణలో ముస్లింలకు కూడా ముస్లిం బంధు ఇవ్వాలని ఓవైసీ డిమాండ్ చేశారు. ముస్లింలలో పేద ప్రజలు ఎక్కువగానే ఉన్నారని చెప్పారు. గతంలో సీఎం కేసీఆర్ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లామని, కానీ ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదని అన్నారు. ఎంఐఎం బలపడటం కోసం పనిచేస్తాం. ఏ పార్టీతో మద్దతు తీసుకోవాలి.. ఏ పార్టీతో ముందుకెళ్లాలనేది ఆలోచిస్తాం. పాట్నా మీటింగ్‌కు ప్రతిపక్ష పార్టీలు నన్ను పిలవలేదు. తెలంగాణలో మేం కూడా ప్రత్యామ్నాయమే. తెలంగాణలో గెలుపోటములను ప్రజలు నిర్ణయిస్తారని అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ కు ఎంఐఎం మిత్రపక్షంగా ఉంది. అయితే వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో 50 సీట్లలో పోటీ చేస్తామని గతంలో ఎంఐఎం కీలక నేతల్లో ఒకరైన అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీలో ప్రకటించారు. అప్పటి నుంచే మజ్లిస్ పార్టీ తెలంగాణలో ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తుందా ? అనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ కూడా ఇదే రకమైన కామెంట్స్ చేయడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఒకవేళ మజ్లిస్ తెలంగాణలో ఎక్కువ సీట్లలో పోటీ చేస్తే.. దాని ప్రభావం ఎక్కువగా పడేది బీఆర్ఎస్ మీదేననే చర్చ జరుగుతోంది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి