BRS MLC Kavitha: నన్ను అరెస్టు చేయడం అన్యాయం.. ఎమ్మెల్సీ కవిత ఫైర్ TG: బీజేపీపై విమర్శలు చేశారు ఎమ్మెల్సీ కవిత. తప్పు చేసిన ప్రజ్వల్ రేవణ్ణను బీజేపీ వదిలేసిందని.. తప్పు చేయను తనని అరెస్ట్ చేయడం అన్యాయమని అన్నారు. బీజేపీ నేతలే ప్రజ్వల్ రేవణ్ణను కేసు నుంచి తప్పించేందుకు విదేశాలకు పంపించారని ఆరోపించారు. By V.J Reddy 07 May 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి BRS MLC Kavitha: లిక్కర్ స్కాం కేసులో ఈరోజు విచారణకు హాజరైన ఎమ్మెల్సీ కవిత బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. బీజేపీ నేతలు తప్పు చేసిన ప్రజ్వల్ రేవణ్ణను వదిలేశారని ఫైర్ అయ్యారు. ప్రజ్వల్ రేవణ్ణను వదిలేసి దేశం దాటించారు అని ఆరోపించారు. తప్పు చేసిన వాళ్ళని వదిలేసి.. తప్పు చేయని నా లాంటి వారిని అరెస్టు చేయడం అన్యాయం అని అన్నారు. దేశ ప్రజలు అన్నింటినీ గమనించాలని కోరారు. #WATCH | Delhi excise policy case | BRS leader K Kavitha leaves from Rouse Avenue Court, says, "Investigation agencies are leaving people like Prajwal Revanna and arresting people like us." pic.twitter.com/LEVyiUEnrf — ANI (@ANI) May 7, 2024 ALSO READ: బీజేపీ ద్వేషాన్ని పెంచి పోషించింది.. సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు మే 14 వరకు కవిత కస్టడీ.. లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ తగిలింది. ఆమె జ్యుడీషియల్ కస్టడీని మే 14 వరకు పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును వెల్లడించింది. కాగా ఎమ్మెల్సీ కవితకు షాక్ తో పాటు కాస్త ఊరటనిచ్చింది కోర్టు. కస్టడీలో ఉన్న కవితను ముగ్గురు కుటుంబ సభ్యులు కలిసేందుకు అనుమతించింది. కవిత పై వారం రోజుల్లో ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేయనుంది. బెయిల్ పై ఆశ.. నిరాశే.. లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఈడీ, సీబీఐ నమోదు చేసిన రెండు కేసుల్లోనూ కవితకు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించింది. కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను డిస్మిస్ చేసింది న్యాయస్థానం. ఈ మేరకు న్యాయమూర్తి కావేరి బవేజా తీర్పు వెలువరించారు. ఈ రోజు కవితకు బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ శ్రేణులతో పాటు కుటుంబ సభ్యులు భావించారు. కానీ న్యాయస్థానం ఆమెకు బెయిల్ ను నిరాకరించడంతో వారు షాక్ కు గురయ్యారు. #brs #mlc-kavitha #kejriwal మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి