నల్గొండ జిల్లాలో హౌస్ అరెస్ట్‌లు..అసెంబ్లీ ముట్టడికి సెకండ్ ఏఎన్ఎంల పిలుపు

నల్లగొండ జిల్లాలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఏఎన్ఎంలు అసెంబ్లీ ముట్టడికి యత్నిస్తున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని ఎక్కడికెక్కడికి హౌస్ అరెస్ట్ చేస్తూ పలువురిని పోలీస్ స్టేషనులకు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో జరుగుతున్న హౌస్‌ అరెస్ట్‌లపై పలువురు ప్రతిపక్ష నాయకులు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు.

New Update
నల్గొండ జిల్లాలో హౌస్ అరెస్ట్‌లు..అసెంబ్లీ ముట్టడికి సెకండ్ ఏఎన్ఎంల పిలుపు

ఉద్రిక్త వాతావరణం

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు రెండో రోజు ప్రారంభమైయ్యాయి. సభలో ప్రశ్నోత్తరాలు కొనసాతున్నాయి. అయితే అసెంబ్లీ బయట మాత్రం ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. నేడు కూడా పలు సంఘాల నేతలు విడతల వారీగా వచ్చిన అసెంబ్లీ ముట్టడికి యత్నిస్తున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ కాంగ్రెస్ ఫిషర్మెన్ నాయకులు, కార్యకర్తలు, ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు, ఏఎన్‌ఎమ్ ఉద్యోగులు ఇలా పలు సంఘాల నేతలు విడతల వారీగా వచ్చి అసెంబ్లీని ముట్టడించాలని ప్రయత్నించారు. అయితే వచ్చిన వారిని వచ్చినట్టే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

రెగ్యులర్ చేయాలని డిమాండ్

ఉమ్మండి నల్లంగొడ జిల్లా వ్యాప్తంగా హౌస్‌ అరెస్ట్‌లు కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా సెకండ్ ఏఎన్ఎమ్‌లను హౌస్ అరెస్ట్‌లు చేసి.. పోలీస్ స్టేషన్‌లకు తరలిస్తున్నారు పోలీసులు. 16 సంవత్సరాల నుండి కాంట్రాక్టు ఉద్యోగులుగా పని చేస్తున్న మమ్మల్ని.. జీవో నెంబర్ 16 ప్రకారం హెల్త్ అసిస్టెంట్‌లను ఏ రకంగా రెగ్యులర్ చేశారో అదేవిధంగా తమని కూడా రెగ్యులర్ చేయాలంటూ వారు డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను, ఇబ్బందులను ఇప్పటికే చాలాసార్లు మంత్రి హరీష్‌రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, పలువురు ఎమ్మెల్యేలను కలిసి విన్నవించినా ఇంతవరకు ఏవింధంగా స్పందచలేదని ఏఎన్ఎంలు మండిపడుతున్నారు. తమ విన్నపాన్ని పట్టించుకోకపోవడంతో అసెంబ్లీ ముట్టడి చేస్తామని సెకండ్ ఏఎన్ఎంలు హెచ్చరిస్తున్నారు. అసెంబ్లీ ముట్టడికి రాకుండా ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ సెకండ్ ఏఎన్ఎంలను అరెస్టులు చేస్తున్నారు పోలీసులు.

స్పందించని అధికారులు

ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వంపై కాంట్రాక్టు ఉద్యోగులు, పలువురు ప్రతిపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా కనీసం మా గురించి ఆలోచించడం లేదంటూ మండిపడుతున్నారు. ఇప్పటికైనా బీఆర్ఎస్‌ ప్రభుత్వం స్పందించి మమ్మల్ని రెగ్యులర్ చేయకపోతే పరిస్థితి ఉద్రిక్తత చేస్తామని వారుహెచ్చరిస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు మొరపెట్టుకున్న ఏ విధంగా స్పందించట్లేదంటూ నేడు తెలంగాణ అసెంబ్లీ వద్ద మా సమస్యలను తేల్చుకుంటాను అంటూ ముట్టడికి వెళ్తున్నారు పలువురు కాంట్రాక్టు ఉద్యోగులు.

Advertisment
Advertisment
తాజా కథనాలు