Dehradun: పెళ్లి చేసుకోమని అడిగిన నేపాలీ అమ్మాయిని చంపేసిన ఆర్మీ అధికారి!

పెళ్లి చేసుకోవాలని పదేపదే అడుగుతుండడంతో ఆమెను చంపేసినట్లు ఆ అధికారి అంగీకరించాడు. ఈ దారుణ ఘటన ఉత్తరాఖండ్‌(Uttarakhand)  లోని డెహ్రాడూన్‌ (Dehradun) లో జరిగింది.

New Update
Dehradun: పెళ్లి చేసుకోమని అడిగిన నేపాలీ అమ్మాయిని చంపేసిన ఆర్మీ అధికారి!

దేశాన్ని కాపాడే బాధ్యతలో ఉండి కూడా ఓ ఆర్మీ అధికారి (Army Officer)  ఓ మహిళను హత్య చేశాడు. పెళ్లి చేసుకోవాలని పదేపదే అడుగుతుండడంతో ఆమెను చంపేసినట్లు ఆ అధికారి అంగీకరించాడు. ఈ దారుణ ఘటన ఉత్తరాఖండ్‌(Uttarakhand)  లోని డెహ్రాడూన్‌ (Dehradun) లో జరిగింది.పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..లెఫ్టినెంట్‌ (Leftinent kalnal) కల్నల్‌ రామెండు ఉపాధ్యాయ్‌ మూడు సంవత్సరాల క్రితం క్లెమెంట్‌ టౌన్‌ కంటోన్మెంట్‌ ప్రాంతంలో విధులు నిర్వహించారు.

ఆ సమయంలో అక్కడ ఓ బార్‌ లో డ్యాన్సర్‌(Bar dancer) గా చేస్తున్న నేపాల్ కు చెందిన శ్రేయా శర్మ అనే మహిళతో ఆయనకు పరిచయం ఏర్పడింది. అది కాస్త వారి మధ్య అక్రమ సంబంధానికి దారి తీసింది. కొంతకాలానికి ఆయనకు వేరే చోటుకి బదిలీ అయ్యింది. ఆ విషయం తెలిసిన శ్రేయాశర్మ అతనితో పాటు తనను కూడా తీసుకుని వెళ్లామని , వివాహం చేసుకోవాలని అడిగింది. అయితే అప్పటికే ఆ ఆర్మీ అధికారికి వివాహం కావడంతో ఆమెను వేరే ప్లాట్ తీసుకుని అందులో అద్దెకు ఉంచారు.

ఆయన అలా మూడు సంవత్సరాల నుంచి గడుపుతున్నాడు. ఈ క్రమంలో ఆ మహిళ అతనిని తరచూ పెళ్లి చేసుకోమని అడుగుతుండడంతో పాటు కొన్ని సార్లు ఈ విషయం గురించి ఇద్దరి మధ్య గొడవలు కూడా జరిగాయి. అయితే రెండు రోజుల క్రితం శనివారం రాత్రి రాజ్‌ పూర్‌ రోడ్డు లో ఓ క్లబ్‌ లో ఇద్దరూ కలిసి మద్యం సేవించారు.

అక్కడ నుంచి శ్రేయ ను తీసుకుని కారులో వెళ్లాడు. అలా చాలా దూరం వెళ్లిన తరువాత ఓ నిర్మాణుష్య ప్రదేశంలో కారుని ఆపి..కిందకి దిగి తనతో తెచ్చుకున్న సుత్తితో మహిళ తల పై గట్టిగా పలుమార్లు కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె చనిపోయిందని నిర్థారించుకున్న తరువాత ఆమె డెడ్‌ బాడీని అక్కడ చెట్ల పొదల్లో పడేసి అక్కడ నుంచి పారిపోయాడు.

అయితే మరుసటి రోజు ఉదయం మహిళ మృతదేహాన్ని చూసిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా..ఆ మహిళ వివరాలు తెలిశాయి. ఈ క్రమంలో లెఫ్టినెంట్‌ కల్నల్ ఉపాధ్యాయ్‌ ను అదుపులోనికి తీసుకుని విచారించగా..మహిళను హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. దీంతో పోలీసులు నిందితున్ని అదుపులోనికి తీసుకుని దర్యాప్తు చేపట్టారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు