మీరు వీటిని గమనించకపోతే పక్కాగా బకెట్ తన్నేస్తారు..! కొలెస్ట్రాల్ పెరిగితే చాలా సమస్యలు వస్తాయి. కొలెస్ట్రాల్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి మంచి కొలెస్ట్రాల్, రెండు చెడు కొలెస్ట్రాల్. వీటి కారణంగా మనకి చాలా ఆరోగ్య సమస్యలొస్తాయి. అందుకే, దీనిని ముందుగానే గుర్తించాలి. అదెలానో తెలుసుకోండి.. By Durga Rao 29 Apr 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి మన బాడీలో కొలెస్ట్రాల్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి మంచి కొలెస్ట్రాల్, రెండు చెడు కొలస్ట్రాల్. వీటి కారణంగా మనకి చాలా ఆరోగ్య సమస్యలొస్తాయి. హై కొలెస్ట్రాల్ కారణంగా, బీపి, షుగర్, గుండెపోటు, కరోనరీ ఆర్టరీ సమస్యలు వస్తాయి.రక్తంలో కొలెస్ట్రాల్ పెరగడాన్నే హై కొలెస్ట్రాల్ అంటారు. దీనినే హైపర్లిపిడెమియా, హైపర్ కొలెస్టెరోలేమియా అని కూడా ఉంటారు. మన బాడీ పనిచేయడానికి సరైన మొత్తంలో లిపిడ్స్ అవసరం. మీకు చాలా లిపిడ్స్ ఉంటే మీ శరీరం వీటిని వాడదు. ధమనుల్లో లిపిడ్స్‌ని నిర్మిస్తాయి. ఇవన్నీ రక్తంలో ఇతర పదర్థాలతో కలిపి ఫలకంలా తయారవవుతాయి. హైకొలెస్ట్రాల్ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. దీనిని ముందుగా గుర్తించకపోతే ప్రాణానికే ప్రమాదం. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మొదట్లో ఎలాంటి లక్షణాలు కనిపించవు. లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్‌తో ఈ సమస్యని గుర్తించొచ్చు.రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు ధమనుల్ల అడ్డంకులు ఏర్పడతాయి. దీంతో గుండెకి రక్తం సరిగా అందదు. ఈ కారణంగా గుండెపోటు వస్తుంది. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే తొడలు, తుంటి, కాళ్ళ కండరాలలో నొప్పులు ఉంటాయి. ధమనుల్లో కొవ్వు పేరుకుపోతే గుండెకి రక్తం చేరదు. అదనంగా, రక్తప్రసరణ కూడా ఎఫెక్ట్ అవుతుంది. కాళ్ళలో రక్త ప్రసరణ తగ్గుతుంది. దీంతో బాడీలో ఆక్సిజన్ కొరత ఏర్పడి శరీర భాగాల్లో నొప్పిగా ఉంటుంది. దీనినే పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ అంటారు. అరకాళ్ళలో తీవ్రమైన నొప్పి రావటం.కాళ్ళ తిమ్మిర్లు,పాదాలు చల్లగా మారడం,కాలి గోళ్ళు పసుపు రంగులోకి మారడం,పాదాలు ఉబ్బడం,కాళ్ళలో బలహీనత,కాళ్ళ చర్మ రంగులో మార్పు వంటివి మనకు కొలస్ట్రాల్ పెరిగిందని తెలిపేందుకు సంకేతాలు. #best-health-tips మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి