మీరు ఫేస్‌బుక్ వాడుతున్నారా.. అయితే ఇలా మోసపోకండి! స్మార్ట్ ఫోన్ వాడకం విస్తృతం అయ్యే కొద్దీ మోసపోయ్యే వాళ్ల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. సోషల్‌మీడియా వేదికగా జరుగుతున్న దారుణాలే అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. విషయం ఏంటన్నది తెలుసుకోకుండా క్లిక్ చేశావా అంతే సంగతి. ముక్కు.. ముఖం తెలియని వ్యక్తులు సహాయం చేస్తాను అంటే అస్సలు నమ్మొద్దు.. అంతేకాదు డబ్బులు విషయం అయితే ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫోన్‌కి తరుచు వచ్చే లింకులను క్లిక్ చేశారా మీరు మోసపోయినట్లే. అటు ఫేస్‌బుక్‌లోనూ మోసపూరీత యాడ్‌లు పెరిగిపోయాయి. ఓ మాయగాడి మాటలు నమ్మి డబ్బులు పొగొట్టుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా అలాంటి ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. By Vijaya Nimma 17 Jul 2023 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి యాడ్ చూసి మోసపోయాడు ఓ వ్యక్తి ఫేస్ బుక్‌లో యాడ్ చూసి మోసపోయాడు. పాత నాణేలు కొంటానని ఫేస్‌బుక్‌లో యాడ్ చూసి.. నాణేలు ఉన్నాయని సాయిలు అనే వ్యక్తి ఫోన్ చేసి చెప్పాడు. తామే అక్కడికి వచ్చిన తర్వాత నాణేలకు 60 లక్షలు ఇస్తామని చెప్పిన మోసగాళ్లు.. ముందుగా రూ.60 వేలు నగదును వారి అకౌంట్లో వేయించుకున్నారు. ఇంకేముంది డబ్బులు తీసుకున్న తర్వాత ఫోన్ స్విచ్చాఫ్ అవ్వడంతో మోసపోయానని తెలుసుకున్న బాధితుడు పోలీస్ స్టేషన్ వెళ్లి పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బీర్కుర్ మండలం తిమ్మాపూర గ్రామంలో చోటుచేసుకుంది. నమ్మించి డబ్బు వాసుళ్లు ఈ మధ్య ఫేస్‌బుక్ పరిచయాలు చాలా దారుణంగా ఉంటున్నాయి. ఉద్యోగాలు.. అధిక డబ్బులు, వీసాలు.. పాత నాణేలు తీసుకుంటామని యాడ్ ఇచ్చి ప్రజలన్ని మోసం చేస్తున్నారు. ఇలా ఘటనలు చాలా ఎక్కువగా జరుగుతున్న విషయాలు మనం చూస్తేనే ఉంటాం.. అయినా ప్రజలు మళ్లీ మళ్లీ మోసపోతునే ఉంటున్నారు. పాత నాణేలు తీసుకోని డబ్బులు ఇస్తామని నమ్మించి మోసం చేశారు మాయగాళ్లు. తిమ్మాపూర గ్రామానికి చెందిన సాయిలు ఫేస్‌బుక్‌లో ఓ యాడ్ చూసి 60 వేలును పొగొట్టుకున్నాడు. పాత నాణేలు తీసుకోని మేము వచ్చి 60 లక్షలు ఇస్తామని నమ్మించాడు దుండగుడు. ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశ పడిన సాయిలు వారు ఏం చెబితే అదే విన్నాడు..పాటించాడు..! అదే అతని కొంపముంచింది. ముందుగా 60 వేలు వేయాలని దుండగుడు చెప్పటంతో 60 లక్షలు వస్తున్నాయని ఏం ఆలోచించకుండా వారిని నమ్మి 60 వేల అతడి ఖాతాకు వేశాడు. తీరా డబ్బులు తీసుకున్న తర్వాత ఫోన్ స్విచ్చాఫ్ రావటం అసలు విషయం బయటపడింది. చేసేది ఏం లేక పోలీసులకు ఫిర్యాదు చేశాడు సాయిలు. విషయం తెలుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బీ..కేర్‌పుల్ ఇప్పటికైన ఆన్‌లైన్‌లో..ఫేస్‌బుక్ ప్రకటన వీడియోలు చూసి మోస పోవద్దని జనం గుర్తించాలి. డబ్బులు తీసుకోవాటానికి ఇలాంటి సేవలను ప్రోత్సహిస్తుంటారు మాయగాళ్లు. ఒక్క క్షణంలో ఆకట్టుకునే ప్రకటన వీడియోను రూపొందించి..ఫేస్‌బుక్‌లో ప్రకటన ఇస్తారు. వివిధ ప్రకటన వల్ల ఇలానే చాలామంది మోసపోతున్నారు. మీ దృష్టిని మార్చటానికి వివిధ రకాల యాడ్‌తో.. ఆఫర్లతో ప్రయత్నిస్తుంటారు. చేతిలో ఫోన్ ఉంది కదా అని ఇష్టం వచ్చిననట్లు యాడ్స్ ఓపెన్ చేయొద్దు.. అసలు విషయం తెలుసుకోని.. దానిపై ఆరా తీయాలి. ఇలాంటి క్రైమ్ మనల్ని మోసం చేయటానికి ప్రతి క్షణం రెడీగా ఉంటాయి. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి