Cyber Crime: పాత ఫోన్లు అమ్మేస్తున్నారా.. జర జాగ్రత్త!

పాత ఫోన్లను పడేస్తున్నారా? లేక పాత ప్లాస్టిక్/ఇనుప సమాను కింద అమ్మేస్తున్నారా? అయితే.. మీకో షాకింగ్ న్యూస్. ఇలా చేస్తే మీ పాత ఫోన్ మిమ్ముల్ని కేసుల పాలు చేసే ప్రమాదం ఉంది. ఎందుకో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి.

New Update
Cyber Crime: పాత ఫోన్లు అమ్మేస్తున్నారా.. జర జాగ్రత్త!

Cyber Crime: మీ పాత ఫోన్లకు గాజు గ్లాసులు ఇస్తాం..గాజు గిన్నెలు ఇస్తామంటూ రోజూ మీ ఊర్లో కొందరు వ్యక్తులు తిరుగుతున్నారా..? వస్తువుల కోసం ఆశపడి మీరు మొబైల్ ఫోన్లు అమ్ముతున్నారా..? అయితే జర జాగ్రత్త. ఇలా పాత ఫోన్లను అమ్మడం వల్ల భవిష్యత్తులో మీరు ఇబ్బందుల్లో పడే అవకాశాలున్నాయి.

ఎందుకంటే... ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్‌లో బీహార్‌కు చెందిన కొందరు వ్యక్తులు పాత మొబైల్‌ ఫోన్లను తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారన్న సమాచారం మేరకు రామగుండం సైబర్‌ సెక్యూరిటీ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌వో కృష్ణమూర్తి తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు.ఆ ఏరియాలో అనుమానాస్పదంగా తిరుగుతున్న మహ్మద్‌ షమీమ్‌, అబ్దుల్‌ సలాం, మొహమ్మద్‌ ఇఫ్తికార్‌, అఖ్తర్‌ అలీ అనే వ్యక్తులను అరెస్ట్‌ చేసి, కేసు నమోదు చేశారు.

వారంతా బీహార్‌లోని హతియా దియారాకు చెందినవారుగా గుర్తించి, వారి వద్ద ఐదు సంచుల్లో 4వేల పాత ఫోన్లను గుర్తించారు.ఈ ఫోన్లను తమ సహచర వ్యక్తికి అమ్మితే, అతను జార్ఖండ్‌ రాష్ట్రంలోని జమ్తారా, దియోఘర్‌ ప్రాంతాలకు చెందిన సైబర్‌ నేరగాళ్లకు సరఫరా చేస్తాడని పోలీసుల విచారణలో ఒప్పుకొన్నారు.

వారు ఫోన్లకు మరమ్మతులు చేసి, సైబర్‌ మెసాలకు పాల్పడుతారని తెలిపారు. దీంతో ఫోన్‌ ఐఎంఈఐ నంబర్‌ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడే ప్రమాదమున్నదని, అలాగే మీ డేటా రికవరీ చేసి బ్లాక్‌మెయిల్‌ చేసే ముప్పు ఉందని పోలీసులు తెలిపారు. ఎవరైనా పాత ఫోన్లను విక్రయించే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, ఎవరికి పడితే వారికి విక్రయించవద్దని తెలిపారు.

Also Read: ఒక్క ఘటన..మూడు జిల్లాలు..మాటలకందని విషాదం!

Advertisment
Advertisment
తాజా కథనాలు