Gyanvapi Masjid: జ్ఞానవాపి మసీదు కింద తెలుగు శాసనాలు.. ASI సంచలన రిపోర్ట్‌

జ్ఞానవాపి మసీదుపై ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియా (ఏఎస్ఐ) సంచలన రిపోర్ట్ ఇచ్చింది. మసీదు కింద హిందూ దేవాలయానికి సంబంధించిన ఆనవాళ్లు ఉన్నట్లు తెలిపింది. 839 పేజీల రిపోర్ట్‌లో ఉత్తర-దక్షిణ సాంస్కృతిక సమ్మేళనానికి చెందిన 34 శాసనాలున్నట్లు పేర్కొంది.

New Update
Gyanvapi Masjid: జ్ఞానవాపి మసీదు కింద తెలుగు శాసనాలు.. ASI సంచలన రిపోర్ట్‌
ASI Survey Report on Gyanvapi Masjid: జ్ఞానవాపి మసీదుపై ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియా (Archaeological Survey of India) సంచలన రిపోర్టును బయటపెట్టింది. వారణాసిలోని విశ్వనాథుడి ఆలయానికి ఆనుకుని ఉన్నమసీదు అడుగుభాగాన హిందూ  దేవాలయానికి (Hindu Temple) సంబంధించిన ఆనవాళ్లు ఉన్నట్లు తెలిపింది. సంస్కృతం, ద్రావిడ భాషలలో 12 నుంచి 17వ శతాబ్దాల నాటి శాసనాలను వెలికితీసింది. ఇది ఉత్తర-దక్షిణ సాంస్కృతిక సమ్మేళనాన్ని సూచిస్తుందని, పురాతన ఆలయాన్ని కూలగొట్టే మసీదును నిర్మించినట్లు తెలిపింది.

839 పేజీల రిపోర్ట్‌..
ఈ మేరకు 839 పేజీల రిపోర్ట్‌లో మసీదు నిర్మాణంలో ఆలయ స్తంభాలను, రాళ్లను ఉపయోగించారని, ఆలయం గోడలతోపాటు కొన్ని ఇతర నిర్మాణాలను యథాతథంగా మసీదులో కలిపేశారని తెలిపింది. ఆ రిపోర్ట్‌ను కోర్టు ఆదేశాల మేరకు హిందూ, ముస్లిం సంస్థలకు పంపిచగా.. హిందూ కక్షిదారుల తరఫు న్యాయవాది విష్ణుశంకర్‌జైన్‌ (Vishnu Shankar Jain) ఏఎస్‌ఐ సర్వే నివేదికలో ఉన్న వివరాలను వెల్లడించారు.అలాగే ఆలయ కూల్చివేత ఎప్పుడు జరిగింది? ఎలాంటి ఆధారాలు లభించాయి? మసీదు నిర్మాణ ఎప్పుడు జరిగింది? ఎలాంటి శాసన ఆధారలు లభించాయనే కీలక అంశాలను ఈ రిపోర్టులో పొందుపరిచినట్లు వెల్లడించింది.

34 శాసనాలు..
'మసీదు గోడలపై ఆలయ నిర్మాణానికి సంబంధించి 34 శాసనాలు ఉన్నాయి. ఆయా శాసనాలు దేవనాగరి, గ్రంథ, తెలుగు, కన్నడ లిపుల్లో ఉన్నాయి. అలాంటి శాసనాలను హిందూ ఆలయాల్లో ఏర్పాటు చేస్తారు. ఈ శాసనాల మీద జనార్థన, రుద్ర, ఉమేశ్వర అనే దేవుళ్ల పేర్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆలయం గోడల మీద చిత్రించిన కమలం గుర్తులను తొలగించి ఆ గోడలను మసీదు నిర్మాణంలో ఉపయోగించిన ఆధారాలు కూడా ఉన్నాయి'అని ఏఎస్‌ఐ సర్వే తేల్చింది.

ఇది కూడా చదవండి: Jharkhand CM: రెండు రోజులుగా కనిపించని జార్ఖండ్‌ సీఎం.. సీఎం కుర్చీలో సోరెన్‌ సతీమణి!

ఔరంగజేబు హయాంలో..
ఇక 17వ శతాబ్దంలో ఔరంగజేబు హయాంలో ఆలయాన్ని ధ్వంసం చేసి మసీదును నిర్మించినట్లు రిపోర్ట్‌లో పేర్కొంది. దేవతల విగ్రహాలు, శిల్పాలు భూమిలో కూరుకుపోయి కనిపించాయని, పశ్చిమం వైపున్న ఆవరణలో తోరణంతో కూడిన భారీ ప్రవేశద్వారం ఉందని వెల్లడించింది. పశ్చిమం వైపున్న గోడ పురాతన ఆలయానికి సంబంధించిందేనని కూడా ఏఎస్‌ఐ నిర్ధారించింది. కాగా, ఈ కేసుకు సంబంధించి జిల్లా కోర్టు మసీదు ప్రాంతంలో సర్వేకు 2023 జూలై 21న ఆదేశించింది. సర్వే అనంతరం ఆ రిపోర్ట్‌ను ఏఎస్‌ఐ డిసెంబరు 18న కోర్టుకు సమర్పించింది. ఈ సర్వే నివేదిక ప్రతిని తమకు అందజేయాలని హిందూ, ముస్లిం కక్షిదారులు కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు