APSRTC: కార్తీక మాసం సందర్భంగా గుడ్‌ న్యూస్‌ చెప్పిన ఏపీఎస్‌ఆర్టీసీ!

కార్తీక మాసం సందర్భంగా ఏపీఎస్‌ ఆర్టీసీ పంచారామాలను దర్శించడానికి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. అంతేకాకుండా శబరిమల, అరుణాచలానికి కూడా ప్రత్యేక సర్వీసులను నడపనుంది,

New Update
APSRTC: కార్తీక మాసం సందర్భంగా గుడ్‌ న్యూస్‌ చెప్పిన ఏపీఎస్‌ఆర్టీసీ!

APSRTC Special Buses: ఏపీఎస్‌ఆర్టీసీ  ప్రయాణికులకు ఓ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. కార్తీక మాసం (Karthika Masam) సందర్భంగా పంచారామ క్షేత్రాలకు వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు వివరించింది. అంతేకాకుండా శబరిమల(Sabarimala) వెళ్లే అయ్యప్ప భక్తులకు..అరుణాచలం వెళ్లే భక్తుల కోసం కూడా ప్రత్యేక సర్వీసు నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు.

కార్తీక మాసంలో శివ క్షేత్రాలకు భక్తులు అధిక సంఖ్యలో వెళ్తుంటారు. అందుకే ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా ఆర్టీసీ (APSRTC) ప్రత్యేక బస్సులు నడిపేందుకు సిద్దమైంది. ఈ నెల 19, 26 తేదీలతో పాటు డిసెంబర్‌ 3, 10 తేదీల్లో ఈ ప్రత్యేక బస్సులను నడపనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు పార్వతీపురంలో బస్సు బయల్దేరుతుంది.

Also read: సముద్రంలో కుప్పకూలిన హెలికాఫ్టర్‌..ఐదుగురు సైనికులు మృతి

సోమవారం నాడు ఉదయం అమరావతి-అమరేశ్వరుడు, భీమవరం- భీమేశ్వరుడు, పాలకొల్లు- క్షీర రామలింగేశ్వరుడు, ద్రాక్షారామం-భీమలింగేశ్వరుడు, సామర్లకోట-కుమార లింగేశ్వరుడిని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు వివరించారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన అల్ట్రా డీలక్స్‌ లో ఒక్కొక్కరికి రూ. 2,150 లు ఛార్జీగా పెట్టినట్లు అధికారిక సుధాకర్‌ ఓ ప్రకటనలో తెలిపారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే చాలా మంది భక్తులు మాలలు వేశారు. మండల దీక్షలను బట్టే ఇప్పటికే కొందరు శబరి కొండకు వెళ్తున్నారు. మరికొందరు సంక్రాంతి జ్యోతి దర్శనానికి వెళ్తున్నారు. శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు ఆరు రోజుల యాత్ర సాగేలా ప్రత్యేక బస్సులు నడుపుతోంది.

ఇందులో కాణిపాకం, శ్రీపురం,అరుణాచలం, పళని, ఎరుమేలి, శబరిమల, మధురై, కంచి, తిరుపతి, విజయవాడలోని ప్రసిద్ధ ఆలయాల సందర్శనకు వీలుగా అధికారులు ప్లాన్ చేశారు. ఈ టూర్‌ వెళ్లే వారి కోసం...సూపర్‌ లగ్జరీకి రూ.7,300 , అల్ట్రా డీలక్స్‌ రూ. 7,200 లు ఛార్జీని నిర్ణయించారు. మరో వైపు అరుణాచలం కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వెళ్తుంటారు.

Also Read:  లిరిక్ తెలియదా..ఏం పర్లేదు, హమ్ చేసినఆ చాలు యూట్యూబ్ వెతికేస్తుంది.

అరుణాచలం వెళ్లాలనుకునే వారి కోసం కడప జిల్లాలోని వివిధ డిపోల నుంచి ఈ నెల 26 నుంచి ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు ప్రకటించారు. జమ్మలమడుగు డిపో నుంచి 26 వ తేదీన బయల్దేరనున్న ప్రత్యేక బస్సు ప్రొద్దుటూరు, మైదుకూరు, కడప, కాణిపాకం, గోల్డెన్‌ టెంపుల్‌ మీదుగా అరుణాచలం చేరుకోనుంది.

టికెట్‌ ధరను రెండు వైపులకు కలుపుకుని రూ.1557 గా నిర్ణయించారు. మైదుకూరు డిపో నుంచి ఉదయం 6, 7, సాయంత్రం 6 గంటలకు ప్రత్యేక సర్వీసులు బయల్దేరతాయి. టికెట్‌ ధర రూ. 1135, రూ. 1414 గా పేర్కొన్నారు. బద్వేలు డిపో నుంచి పోరు మామిళ్లలో ఉదయం 5:30 , 6 గంటలకు సర్వీసులు బయల్దేరి..పెంచలకోన, శ్రీకాళహస్తి, గోల్డెన్ టెంపుల్‌, కాణిపాకం మీదుగా వెళ్తాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు