AP RTC Buses Bandh: చంద్రబాబు అరెస్ట్‌..డిపోలకే పరిమితం అయిన బస్సులు!

చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఎక్కడికక్కడ ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా బస్సుల నిలిపివేతకు ఏపీ ప్రభుత్వం అప్రకటిత ఆదేశాలు జారీ చేసింది.

New Update
AP RTC Buses Bandh: చంద్రబాబు అరెస్ట్‌..డిపోలకే పరిమితం అయిన బస్సులు!

AP RTC Buses Bandh: ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తెలుగుదేశం పార్టీ (TDP Party) అధినేత చంద్రబాబు (Chandrababu) అరెస్ట్ తో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. చంద్రబాబును అరెస్ట్ చేయడంతో పాటు..టీడీపీ ముఖ్య నేతలను ముందస్తుగా హౌస్ అరెస్టులు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.

చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఎక్కడికక్కడ ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా బస్సుల నిలిపివేతకు ఏపీ ప్రభుత్వం అప్రకటిత ఆదేశాలు జారీ చేసింది. అందుకే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా అన్ని ఆర్టీసీ డిపోల్లోనూ ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. ఆర్టీసీ బంద్‌ తో రోడ్లన్ని నిర్మానుష్యంగా తయారయ్యాయి.

కొన్ని చోట్ల ప్రయాణికులతో వెళ్తున్నప్పటికీ వారిని కిందకి దించి మరి బస్సులను డిపోలకు తరలిస్తున్నారు. కొన్ని బస్సుల్లో టికెట్‌ డబ్బులు కూడా వెనక్కి ఇస్తున్నారు. మరి కొన్ని చోట్ల ఉదయం నుంచి కూడా ఒక్క బస్సు కూడా రోడ్డు ఎక్కలేదు. బస్సులను నిలిపివేయడానికి గల కారణాలను అధికారులు వివరించారు.

చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడడంతో పాటు, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలగకూడదనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు అధికారులు వివరించారు. డిపోల వద్ద, ముఖ్య కూడళ్ల వద్ద ఉదయం నుంచి కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

విజయవాడలో కనీసం సిటీ బస్సులు కూడా రోడ్డేక్క లేదు. అయితే ఈరోజు నిర్వహిస్తున్న కాలేజీలు, స్కూళ్లకు సెలవు ప్రకటించినట్లు అధికారులు వివరించారు. బ‌స్సుల‌పై టీడీపీ కార్య‌క‌ర్త‌లు దాడులు చేసే అవ‌కాశం ఉంద‌న్న ముంద‌స్తు స‌మాచారంతోనే వాటిని నిలుపుద‌ల చేశామ‌ని.. ప‌రిస్థితిని బ‌ట్టి వాటిని న‌డిపే ప్ర‌య‌త్నం చేస్తామ‌ని పోలీసులు తెలిపారు.

Also Read: టీడీపీ లీడర్స్‌ అరెస్ట్..ఏపీలో హై టెన్షన్‌..!

Advertisment
Advertisment
తాజా కథనాలు