APCET : ఏపీ సెట్ దరఖాస్తు గడువు పొడిగింపు! విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు ఏప్రిల్ 28వ తేదీన నిర్వహించే ఏపీ సెట్-2024కు దరఖాస్తు గడువును ఈ నెల 14వ తేదీ వరకు పొడిగించినట్టు ఏపీ సెట్ మెంబర్ సెక్రటరీ ప్రొఫెసర్ జీఎంజే రాజు తెలిపారు. By Trinath 07 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి Apply For APCET : ఏపీ సెట్(APCET) దరఖాస్తు గడువును పొడిగించారు. ఈనెల 14వరకు అప్లయ్ చేసుకునే ఛాన్స్ కల్పించారు. ఈ పరీక్షను ఆంధ్ర యూనివర్సిటీ(Andhra University) నిర్వహిస్తోంది. నిజానికి నిన్నటి(మార్చి 6) తోనే ఏపీ సెట్ దరఖాస్తు(APCET Application) గడువు ముగిసింది. అయితు డెడ్‌లైన్ పొడిగించాలని విద్యార్థుల రిక్వెస్ట్ చేశారు. అందుకే దరఖాస్తు గడువును పొడిగించినట్లు ఏపీసెట్ మెంబర్ సెక్రటరీ ఆచార్య జీఎంజే రాజు(Acharya GMJ Raju) చెప్పారు. మార్చి 14 వరకు ఎలాంటి అదనపు ఫీజు లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. అడ్మిట్ కార్డ్ లేదా హాల్ టిక్కెట్‌ను ఏప్రిల్ 19, 2024న డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష ఏప్రిల్ 28, 2024న జరుగుతుంది. ఎలా దరఖాస్తు చేయాలి: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి, అభ్యర్థులు కింద ఇచ్చిన స్టెప్స్‌ను అనుసరించవచ్చు. --> AP సెట్ apset.net.in అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి. --> హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న AP SET 2024 లింక్‌పై క్లిక్ చేయండి. --> రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయండి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. --> దరఖాస్తుపై క్లిక్ చేసి, అవసరమైన వివరాలను నమోదు చేయండి. --> పూర్తయిన తర్వాత, దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి. --> దరఖాస్తు రుసుము చెల్లించండి. --> సబ్మిట్‌పై క్లిక్ చేసి, పేజీని డౌన్‌లోడ్ చేయండి. --> తదుపరి అవసరం కోసం అదే హార్డ్ కాపీని ఉంచండి. Also Read : 30 ఏళ్లు దాటిన మగవారు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి #andhra-university #apset #acharya-gmj-raju మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి