Traffic : హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు.. రాత్రి 9 గంటల వరకూ నరకమే!

హైదరాబాద్ వాహనదారులకు బిగ్ అలర్ట్. ఏప్రిల్ 26 శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఐటీ కారిడార్​లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. మరి ఏ రూట్ లో వెళ్లాలో తెలియాలంటే ఆర్టికల్ లోకి వెళ్లండి.

New Update
Traffic : హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు.. రాత్రి 9 గంటల వరకూ నరకమే!

Hyderabad : హైదరాబాద్ వాసులకు మరోసారి షాక్ న్యూస్ చెప్పారు ట్రాఫిక్ పోలీసులు(Traffic Police). ఇప్పటికే ఎన్నికల హడావుడి, ఐపీఎల్(IPL) కారణంగా తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్న నగర ప్రజలకు మరోసారి కీలక ప్రకటన జారీ చేశారు. ఏప్రిల్ 26న హైటెక్స్​ లో ఓ కార్యక్రమం జరగనుంది. ఈ వేడుకకు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్, వివిధ రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొననున్నారు. ఇందులో భాగంగానే శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఐటీ కారిడార్​లో ట్రాఫిక్ ఆంక్షలు(Traffic Restrictions) విధిస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: Khammam: ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి RRR.. హీరో వెంకటేష్ కు దగ్గరి బంధువు.. ఎలాగో తెలుసా?

బయోడైవర్సిటీ జంక్షన్ మీదుగా..
ఈ మేరకు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45(Jubilee Hills Road No 45) నుంచి కేబుల్ బ్రిడ్జి, బయోడైవర్సిటీ జంక్షన్ మీదుగా గచ్చిబౌలి వైపు వెళ్లే వాహనదారులు మాదాపూర్ పోలీస్ స్టేషన్, సీఓడీ జంక్షన్, దుర్గం చెరువు, ఐలాబ్, ఐటీసీ కోహినూర్, నాలెడ్జ్ సిటీ మీదుగా బయోడైవర్సిటీకి ప్రయాణించాలని సూచించారు. ఇక మియాపూర్, కొత్తగూడ, హఫీజ్ పేట నుంచి హైటెక్ సిటీ, సైబర్ టవర్స్, జూబ్లీహిల్స్, ఖానమేట్, కొత్తగూడ వైపు వచ్చే వాహనాలు రోలింగ్ హిల్స్, ఏఐజీ హాస్పిటల్, ఐకీయా, దుర్గం చెరువు మీదుగా హైటెక్స్, సైబర్ టవర్స్ వైపు వెళ్లాలని చెప్పారు. అలాగే ఈ మీటింగ్ జరిగే పరిసర ప్రాంతాల్లో భారీ వాహనాలను తీసుకురావడం, పార్కింగ్ వంటి వాటిని తాత్కలికంగా నిషేందించినట్లు వెల్లడించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు