YS Sharmila: ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అరెస్ట్

ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అరెస్ట్ అయ్యారు. మెగా డీఎస్సీ ప్రకటించాలని ఆందోళన చేపట్టిన ఆమెను ఉండవల్లిలో పోలీసులు బలవంతంగా ఈడ్చుకుంటూ లాక్కొని వెళ్లారు. దీంతో ఉండవల్లిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

New Update
YS Sharmila: ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అరెస్ట్

APCC chief YS Sharmila: ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఉండవల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆమెతో పాటు పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలను సైతం అదుపులోకి తీసుకున్నారు. మెగా డీఎస్సీ ప్రకటించాలనే డిమాండ్‌తో ఛలో అసెంబ్లీ కార్యక్రమంకు పిలుపునిచ్చింది కాంగ్రెస్ పార్టీ.  పార్టీ కార్యకర్తలతో కలిసి షర్మిల సెక్రేటరియట్ ముట్టడికి బయలుదేరింది.

Also Read: పోటీ చేయాలా? వద్దా?.. గంటా శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు

ఈ క్రమంలోనే ఆమెను కొండవీటి ఎత్తిపోతల దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. నిరసన కార్యక్రమంకు వెళ్లడానికి వీలులేదంటూ కారు నుంచి ఆమెను కిందకు దించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ షర్మిల రోడ్డుపై బైఠాయించింది. దీంతో, పరిస్థితి అదుపు చేసేందుకు షర్మిలను బలవంతంగా ఈడ్చుకుంటూ లాక్కొని వెళ్లి పోలీసు వాహనాల్లోకి ఎక్కించారు. అక్కడి నుంచి మంగళగిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఈ సందర్భంగా జగన్ సర్కార్ పై కాంగ్రెస్ నేతలు సీఎం డౌన్ డౌన్, పోలీసుల జులుం నశించాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మెగా డీఎస్సీని విడుదల చేయాలంటూ నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా నిలిచిన షర్మిలను అరెస్ట్ చేస్తారా? అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

క్షోబిస్తుంది..

వైఎస్ షర్మిలా రెడ్డి మాట్లాడుతూ.. YSR ఆత్మ క్షోబిస్తుందన్నారు. ఈ ఘటనపై అమ్మ కూడా బాధపడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ బిడ్డ పోరాటం చేసింది నిరుద్యోగుల కోసమేనని..సచివాలయంలో వినతి పత్రం ఇవ్వడానికి కూడా స్వేచ్చ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయంలో కనీసం ఒక్కరూ లేరట..సీఎం రాడు..మంత్రులు లేరు..అధికారులు రారు..వీళ్లకు పాలన చేతకాదు అనడానికి ఇదే నిదర్శనం అంటూ మండిపడ్డారు. వీళ్లకు ఏది చేతకాదని ఫైర్ అయ్యారు. బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కనీసం నోటిఫికేషన్ లు ఇవ్వడం చేతకాలేదని..ఒక అడబిడ్డ అని చూడకుండా ఈ విధంగా ప్రవర్తించడం పాపం అని వ్యాఖ్యానించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు