పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్న ప్రభాస్ పెద్దమ్మ.. ఎంపీగా బరిలోకి..?

గతేడాది కృష్ణంరాజు మరణించిన అనంతరం తన కుటుంబం రాజకీయాలకు దూరమయ్యింది. కృష్ణంరాజు భార్య, ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి రాజకీయాల్లోకి రానున్నారా? అంటే ఔననే వార్తలు వస్తున్నాయి. నరసాపురం నియోజకవర్గం నుంచి వైసీపీ పార్టీ నుండి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ పార్టీ శ్యామలాదేవి దగ్గర ప్రతిపాదన ఉంచినట్లు తెలుస్తోంది.

New Update
పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్న ప్రభాస్ పెద్దమ్మ.. ఎంపీగా బరిలోకి..?

ap-politics-reports-said-that-krishnam-raju-wife-shyamala-devi-coming-to-politics

సినీనటులు రాజకీయాల్లోకి రావడం అనేది సర్వసాధారణం. బాలకృష్ణ, రోజా, పవన్ కళ్యాణ్, అలీ, పోసాని కృష్ణ మురళీ ఇలా ఎంతోమంది సినిమాల్లో ఉంటూనే రాజకీయాల్లో కూడా కొనసాగుతున్నారు. గతంలో రెబల్ స్టార్ కృష్ణంరాజు కూడా రాజకీయాల్లో ఎంపీగా, కేంద్ర విదేశాంగ సహాయ మంత్రిగా పని చేశారు. 1999 నుంచి 2004 వరకూ నరసాపురం నియోజకవర్గం ఎంపీగా పని చేశారు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీలో చేరి రాజమండ్రి నుంచి ఎంపీగా పోటీ చేశారు. కానీ ఓటమి పాలయ్యారు. దీంతో మళ్ళీ ఆయన భారతీయ జనతా పార్టీలో చేరారు. గత ఏడాది ఆయన మరణించిన విషయం తెలిసిందే. దీంతో కృష్ణంరాజు కుటుంబం రాజకీయాలకు దూరమయ్యింది.

అయితే ఇప్పుడు ఆ కుటుంబం నుంచి ఒకరు రాజకీయాల్లోకి వస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ పెద్దమ్మ, కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి రాజకీయాల్లోకి వస్తున్నారని.. నరసాపురం నియోజకవర్గం ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వైసీపీ పార్టీ శ్యామలాదేవి దగ్గర ప్రతిపాదన ఉంచినట్లు తెలుస్తోంది. నరసాపురం స్థానం వైసీపీదే అయినప్పటికీ ఆ పార్టీ ఎంపీ వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడుతుండడంతో.. అదే సామాజిక వర్గానికి చెందిన కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవిని రంగంలోకి దించే పనిలో వైసీపీ పార్టీ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు ఆమెతో వైసీపీ పార్టీ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఉమ్మడి గోదావరి జిల్లాల్లో వైసీపీ బాధ్యతలను పర్యవేక్షిస్తున్న లోక్ సభ సభ్యుడు ఈ సంకేతాలను పంపినట్లు సమాచారం. అయితే దీనిపై శ్యామలా దేవి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. కానీ తమ ప్రతిపాదనను ఆమె అంగీకరిస్తారని వైసీపీ పార్టీ భావిస్తుంది. శ్యామలాదేవికి నరసాపురం నియోజకవర్గం నుంచి ఎంపీ టికెట్ ఇస్తే.. ప్రభాస్ ప్రచారం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి గెలుపొందే అవకాశం ఉంటుందని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. మరి ప్రభాస్ పెద్దమ్మ వైసీపీ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు