AP: ఆ హంతకుడిని జగన్ కాపాడుతున్నారు.. షర్మిలా ఆరోపణలు! ఏపీ సీఎం జగన్ పై ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల సంచలన ఆరోపణలు చేశారు. వివేకా హత్య కేసులో అవినాష్‌రెడ్డి నిందితుడని అన్ని ఆధారాలున్నా అతన్ని జగన్ కాపాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి జగన్ రాజకీయ వారసుడే కాదన్నారు. By srinivas 08 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ కడప New Update షేర్ చేయండి YS Sharmila: ఏపీ సీఎం జగన్ (YS Jagan)పై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) సంచలన ఆరోపణలు చేశారు. మాజీ మంత్రి వివేకా హత్య కేసు (Viveka ) లో ఎంపీ అవినాష్‌రెడ్డి నిందితుడని అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ అతన్ని జగన్ కాపాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్సు యాత్రలో భాగంగా వైఎస్‌ఆర్ జిల్లా మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారి మఠంలో ఆమె మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి జగన్ వారసుడే కాదన్నారు. జగన్ మోసం చేశారు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనకు జగన్ పరిపాలకు ఎక్కడ పొంతన లేదన్నారు. వైసీపీ పాలనలో రైతులు నష్టపోయారు. వారిని జగన్ మోసం చేశారు. వైఎస్‌ఆర్ హయాంలో రైతు రారాజు.. ఇప్పుడు అప్పులేని రైతే లేడు. పంట నష్టం జరిగితే రూపాయి కూడా పరిహారం లేదు. సబ్సిడీలన్నీ ఆపేశారు. సంపూర్ణ మద్య నిషేధం హామీ ఇచ్చి స్వయంగా ప్రభుత్వమే విక్రయిస్తోంది. ఇష్టారీతిన అమ్ముతూ కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు తీస్తున్నారని మండిపడ్డారు. ఇది కూడా చదవండి: Kangana: బీఫ్ మాంసం తింటుంది… బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ అదిరిపోయే ఆన్సర్! అలాగే జగన్‌ది హత్యా రాజకీయాల పాలన. సొంత బాబాయిని చంపిన నిందితులను కాపాడుతున్నారు. నిందితుడు అవినాష్‌కే మళ్లీ టికెట్ ఇచ్చారు. అతడు చట్టసభల్లోకి వెళ్లకూడదు. అన్యాయాన్ని ఎదిరించేందుకే ఎంపీగా పోటీచేస్తున్నా. న్యాయం కోసం పోరాటం ఓ వైపు.. హంతకులు మరో వైపు.. ప్రజలు ఎవరిని గెలిపిస్తారో ఆలోచించాలి. హంతకులకు ఓటు వేయొద్దు. వైఎస్‌ఆర్ బిడ్డను గెలిపించాలని కోరుతున్నా. ఏ కష్టం వచ్చినా అందుబాటులో ఉంటనంటూ హామీ ఇచ్చారు. #cm-jagan #sharmila #vivekananda-reddy మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి