వరదలో కొట్టుకొచ్చిన పాలప్యాకెట్లు, ఎగబడిన జనం.. ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా తీర ప్రాంతాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. మచిలీపట్నంలో గురువారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. రోడ్లపై మోకాళ్ల లోతు వరద వచ్చి చేరింది. ఆ వరదలో పాలప్యాకెట్లు కొట్టుకురావడంతో మొదటగా ఆశ్చర్యపోయిన జనం.. తేరుకుని వాటిని ఏరుకునేందుకు ఎగబడ్డారు. By Shareef Pasha 14 Jul 2023 in ఆంధ్రప్రదేశ్ Scrolling New Update షేర్ చేయండి https://twitter.com/KP_Aashish/status/1679450641708589059?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1679450641708589059%7Ctwgr%5E79909489cbdca47452ab560a3b8d114782030e0d%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.ap7am.com%2Fflash-news-776774%2Fpeople-wade-in-knee-deep-water-for-floating-milk-packets-in-machilipatnam ఏపీలో నిన్నటి నుంచి ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న ఉదయం ప్రారంభమైన వర్షాలు ఇవాళ కూడా కొనసాగుతున్నాయి. వర్షాల కారణంగా పలు జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తమవుతోంది. ముఖ్యంగా పలు గ్రామాలు నీటమునగడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇవాళ కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. ఏపీలో భారీ వర్షాలు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో పాటు రుతుపవన ద్రోణి కారణంగా ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న మొదలైన వర్షాలు ఇవాళ మరింత భారీగా కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో జన జీవనంపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం,విశాఖపట్నంలో నిన్న రాష్ట్రంలోనే అతి భారీ వర్షాలు కురిశాయి. శ్రీకాకుళంలోని రణస్దలంలో 125 మి.మీ, విశాఖలోని పెందుర్తిలో 110 మి.మీల వర్షపాతం నమోదైంది. మిగతా జిల్లాల్లోనూ దాదాపు ఇదే పరిస్ధితి. మోకాళ్ల లోతు నీటిలో పాల ప్యాకెట్లను ఏరుకుంటున్న జనాలను కొంతమంది వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వరద నీళ్లలో పాలప్యాకెట్లు కొట్టుకురావడమేంటని ఆరాతీయగా.. సాయిబాబా ఆలయం జంక్షన్‌లో మోకాలి లోతు నీరు నిలిచింది. ఆ వరదలోనే అటుగా వెళ్తున్న ఓ వాహనం నుంచి పాల ప్యాకెట్ల ట్రేలు రోడ్డుపై పడటంతో పాల ప్యాకెట్లు కొట్టుకొచ్చాయని, నీళ్లలో దిగి స్థానికులు వాటిని ఏరుకున్నారని తేలింది. కాగా, రెండు రోజులుగా ఏపీలోని తీర ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. మరో రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ పేర్కొంది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి