ఎమ్మెల్యే బ్యాంక్ రుణాల ఎగవేత, నోటీసులు జారీచేసిన కెనరా బ్యాంక్ అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి సుధీర్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ తీసుకున్న బ్యాంక్ రుణాల ఎగవేత వ్యవహారంలో కెనరా బ్యాంక్ నోటీసులను జారీ చేసింది. బ్యాంక్‌కు 908 కోట్ల రూపాయలు బాకీ రాబట్టుకోవడానికి వేలం ప్రకటన వేశారు. దీంతో జిల్లావ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. By Shareef Pasha 21 Jul 2023 in ఆంధ్రప్రదేశ్ క్రైం New Update షేర్ చేయండి వేలం వేస్తున్నట్టు కెనరా బ్యాంక్ నోటీసులు జారీ.. ఉమ్మడి అనంతపురం ప్రస్తుత శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి రుణాల ఎగవేత వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 908 కోట్లు రాబట్టుకోవడంలో భాగంగా వేలం వేస్తున్నట్టు కెనరా బ్యాంక్ నోటీసులు ఇచ్చింది. ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి హామీదారుగా ఉన్న మెసర్స్ ఎఎస్ఆర్ ఇంజినీరింగ్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ (ప్రస్తుతం మెసర్స్ సాయి. సుధీర్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించకపోవడంతో ఆగస్టు 18న ఆయన ఆస్తులను వేలం వేస్తున్నట్లు కెనరా బ్యాంకు ఈ నెల 2న జారీ చేసిన ప్రకటనలో పేర్కొంది. వడ్డీతో కలిపి రూ.908 కోట్లు అయినట్లు బ్యాంకు ప్రకటన మెసర్స్ సాయి సుధీర్ సుధీర్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీకి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి భార్య అపర్ణ, ఆయన తండ్రి వెంకటరామిరెడ్డి డైరెక్టర్లు, కంపెనీ పేరుతో తీసుకున్న రుణాలు ఏప్రిల్ 30 నాటికి వడ్డీతో కలిపి రూ.908 కోట్లు అయినట్లు బ్యాంకు తన ప్రకటనలో పేర్కొంది. అందువల్ల కంపెనీ ఆస్తులతో పాటు హామీదారుగా ఉన్న శ్రీధర్ రెడ్డి ఆస్తులను కలిపి వేలం వేయనున్నట్లు ప్రకటనలో తెలిపారు. ఈ ఆస్తులన్నీ ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఉన్నాయి.2005 డిసెంబరులో ఏఎస్ఆర్ ఇంజినీరింగ్ అండ్ ప్రాజెక్ట్స్ కంపెనీ ప్రారంభించినట్లు తెలుస్తోంది. పన్నుల ఎగవేతపై బ్యాంక్ సీరియస్ బడాబాబులు అయినటువంటి విజయ్ మాల్యా... నీరవ్ మోదీ... మెహుల్ చోక్సీ! బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టి... విదేశాలకు పారిపోయిన బడా వ్యాపార వేత్తలు వీళ్లు! ఇప్పుడు అదే కోవలోకి ఏపీ నీరవ్ మోదీ ఒకరు తాజాగా బయటపడ్డారు. బ్యాంకులకు రూ.908 కోట్ల రుణం ఎగ్గొట్టారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఇతను.. తాజాగా.. ఈ పన్నుల ఎగవేతపై బ్యాంక్ చాలా సీరియస్‌గా ఉంది. అంతేకాకుండా వడ్డీతో సహా ఎగవేతను తిరిగి త్వరగా చెల్లించాలని ఎమ్మెల్యేను కెనరా బ్యాంక్ కోరింది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి