AP Assembly: రేపే ఏపీ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం.. సాధారణ సభ్యుడిలాగే జగన్ కూడా..! రేపు ఏపీ ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ముందుగా సీఎం, ఆ తర్వాత డిప్యూటీ సీఎం, అనంతరం సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జగన్ కు ప్రతిపక్ష నేత హోదా కూడా లేకపోవడంతో ఆయన సాధారణ సభ్యుడిలాగే ప్రమాణం చేయనున్నారు. By Nikhil 20 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఎమ్మెల్యేలు రేపు ప్రమాణస్వీకారం చేయనున్నారు. రేపు అమరావతిలోని అసెంబ్లీలో వీరితో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ముందుగా సీఎం, డిప్యూటీ సీఎం, ఆ తర్వాత మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. మంత్రుల తర్వాత మహిళా సభ్యులు, వీరి తర్వాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో మిగతా సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రతిపక్ష నేత హోదా కూడా లేకపోవడంతో జగన్ సాధారణ ఎమ్మెల్యేలతో కలిసి ప్రమాణం చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యేల కుటుంబసభ్యులకు అనుమతి ఇవ్వలేదు. అసెంబ్లీలో తగినంత సీటింగ్ లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఏడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన గోరెంట్ల బుచ్చయ్య చౌదరి ప్రొటెం స్పీకర్ గా వ్యవహరించనున్నారు. రేపు ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం తర్వాత ఎల్లుండి స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉంటుంది. స్పీకర్ గా నర్సీపట్నం ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడికి అవకాశం ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. తాను స్పీకర్ కాబోతున్నట్లు అయ్యన్న కూడా ప్రకటించారు. అయితే.. డిప్యూటీ స్పీకర్ ఎవరనే అంశంపై ఇంకా క్లారిటీ రాలేదు. టీడీపీ నుంచే డిప్యూటీ స్పీకర్ ఉంటారా? లేక మిత్రపక్షం అయిన జనసేనకు ఇస్తారా? అన్నది రేపు తేలే అవకాశం ఉంది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి