Big Breaking: పవన్ కల్యాణ్ కు ఏపీ పోలీసుల నోటీసులు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు కృష్ణాజిల్లా పోలీసుల నోటీసులు జారీ చేశారు. వారాహి యాత్రపై రాళ్లదాడికి ప్లాన్ చేశారని నిన్న పవన్ కల్యాణ్‌ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే.. పవన్ ఆరోపణలకు ఏమైనా సాక్షాలు ఉన్నాయా? తెలుసుకోవడానికి నోటీసులు ఇచ్చామని ఎస్పీ ఎస్పీ జాషువా తెలిపారు. ఈ నోటీసుకు పవన్ కల్యాణ్ ఎలాంటి సమాధానం ఇస్తానన అంశం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.

New Update
విశాఖ షిప్పింగ్ హార్బర్‌ బాధితులకు అండగా జనసేనాని.!

Police Issued Notices To Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కృష్ణాజిల్లా పోలీసుల నోటీసులు జారీ చేశారు. వారాహి యాత్ర (Varahi Yatra) పై రాళ్లదాడికి ప్లాన్ చేశారని నిన్న పవన్ కల్యాణ్‌ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే.. పవన్ ఆరోపణలకు ఏమైనా సాక్షాలు ఉన్నాయా? తెలుసుకోవడానికి నోటీసులు ఇచ్చామని ఎస్పీ జాషువా తెలిపారు. పవన్ దగ్గర ఏమైనా సమాచారం ఉంటే తమకు అందించాలని పోలీసులు కోరారు. ఈ నోటీసుకు పవన్ కల్యాణ్ ఎలాంటి సమాధానం ఇస్తానన అంశం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. కృష్ణ జిల్లా పెడనలతో ఈ రోజు సాయంత్రం పవన్ కల్యాణ్ వారాహి యాత్ర నిర్వహించనున్నారు. నిన్న పవన్ చేసిన వాఖ్యల నేపథ్యంలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 350 మందిని మోహరించారు. ఇదిలా ఉంటే.. వైసీపీ నేత జోగి రమేశ్ పవన్ వాఖ్యలపై స్పందించారు. తాను దగ్గరుండి పవన్ ను తీసుకెళ్తానన్నారు. జనం రాకనే పవన్ ఇలాంటి వాఖ్యలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు.

నిన్న మచిలీపట్నం జనవాణి అనంతరం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. జనసేన చేపట్టిన వారాహి విజయ యాత్రను ఎలాగైనా అడ్డుకోవాలని జగన్ ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. అల్లరి మూకలతో గొడవలు సృష్టించి భయబ్రాంతులకు గురి చేయాలని, కేసులతో ఇబ్బందులు పెట్టాలని ప్రణాళిక రచిస్తున్నట్లు సమాచారం ఉందని ఆరోపించారు. నాకు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు.. బుధవారం జరగబోయే పెడన నియోజకవర్గ వారాహి విజయయాత్ర సభలో రౌడీమూకలు, గూండాలు, అల్లరి మూకలను దించి సభపై రాళ్ల దాడి చేయించాలని సీఎం జగన్ ప్రభుత్వం పకడ్బందీగా ప్లాన్ చేసిందని తీవ్ర ఆరోపణలు చేశారు.

సభలో ఎలాంటి అలజడులు సృష్టించినా.. దానికి ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. మచిలీపట్నంలో మంగళవారం నిర్వహించిన జనవాణి – జనసేన భరోసా కార్యక్రమంలో అర్జీలు స్వీకరించిన అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘‘వైసీపీ నాయకుడికి, డీజీపీకి, హోంమంత్రికి, పోలీస్ అధికారులకు స్పష్టంగా చెబుతున్నా.. పెడన సభలో కనుక ఏవైనా గొడవలు పెట్టుకోవాలని చూస్తే ఏ మాత్రం సహించేది లేదన్నారు. ఏం జరిగినా..? వారే పూర్తిగా బాధ్యత తీసుకోవాలంటూ తీవ్ర స్వరంతో హెచ్చరించారు.

Also Read: చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్ల విచారణకు లంచ్ బ్రేక్

Advertisment
Advertisment
తాజా కథనాలు