Pinnelli Ramakrishna Reddy : వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి బెయిల్?

AP: వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్‌పై ఈరోజు హైకోర్టు తీర్పు వెలువరించనుంది. ఎన్నికల సమయంలో టీడీపీ ఏజెంట్, సీఐపై దాడి కేసులో పిన్నెల్లిని జూన్ 26న పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా పిన్నెల్లికి బెయిల్ వస్తుందా?లేదా? అనే ఉత్కంఠ వైసీపీ శ్రేణుల్లో నెలకొంది.

New Update
Pinnelli Ramakrishna Reddy : వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి బెయిల్?

Pinnelli Ramakrishna Reddy: హైకోర్టులో వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరిగింది. నిన్న హైకోర్టులో రెండు వర్గాల వాదన ముగిసింది. ఇవాళ పిన్నెల్లి బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. జూన్‌ 26 నుంచి నెల్లూరు జిల్లా జైలులో ఉన్నారు పిన్నెల్లి. జిల్లా కోర్టులో రెండు సార్లు పిన్నెల్లి బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేశారు. షరతులకు కట్టుబడి ఉంటానని.. బెయిల్ ఇవ్వాలని కోరారు పిన్నెల్లి. ఎన్నికల టైమ్‌లో టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై దాడి కేసు, పోలింగ్‌ తర్వాత కారంపూడిలో సీఐ నారాయణస్వామిపై దాడి కేసులో బెయిల్‌ ఇవ్వాలని పిన్నెల్లి పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

ఎన్నికల రోజున ఈవీఎం ధ్వంసం

2014, 2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు పిన్నెల్లి. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు మాజీ సీఎం జగన్ పిన్నెల్లిని ప్రభుత్వ విప్‌గా నియమించారు. ఈసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పిన్నెల్లి మాచర్ల నుంచి బరిలోకి దిగారు. అయితే మే 13న పోలింగ్ రోజున.. రెంటచింతల మండలం పాల్వాయి గేట్‌ 202 పోలింగ్ కేంద్రంలో చొరబడి ఆయన ఈవీఎంను ధ్వంసం చేశారు. సీసీటీవీ కెమెరాల్లో రికార్డైన ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. టీడీపీ నాయకులు, కార్యకర్తలు రిగ్గింగ్‌కు పాల్పడినందు వల్లే ఈవీఎంను పిన్నెల్లి ధ్వంసం చేశారని వైసీపీ వాదిస్తోంది.

పిన్నెల్లిపై మొత్తం ఎన్ని కేసులంటే

అయితే పోలింగ్ రోజున మాచర్లలో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. అదే రోజున సాయంత్రం పోలీసులు పిన్నెల్లిని గృహనిర్బంధంలో ఉంచారు. ఆ తర్వాత అల్లర్లపై పోలీసులు విచారణ ప్రారంభించడంతో ఆయన మే 14 నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మరోవైపు ఈవీఎంను పగలగొట్టిన వ్యవహారాన్ని ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకుంది. పిన్నెల్లిని అరెస్టు చేయాలని ఆదేశించింది. దీంతో పోలీసులు ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు కేసులు నమోదు చేశారు. పాల్వాయి గేటు పోలింగ్ బూత్‌లో ఈవీఎం ధ్వంసం కేసు, సీఐపై దాడి, టీడీపీ ఏజెంట్స్ పై దాడి, మహిళలను దూషించిన కేసు ఇలా మొత్తం ఆయనపై నాలుగు కేసులు నమోదయ్యాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు