Big Breaking: ఏపీలో ఎస్ఐ నియామకాలపై హైకోర్టు స్టే ఏపీలో ఎస్ఐ నియామక ప్రక్రియపై హైకోర్టు స్టే విధించింది. నియామకాల సందర్భంగా తమకు అన్యాయం జరిగిందని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో విచారణ జరిపిణ న్యాయస్థానం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. By Nikhil 17 Nov 2023 in ఆంధ్రప్రదేశ్ New Update షేర్ చేయండి ఏపీలో ఎస్ఐ నియామక ప్రక్రియపై (AP SI Recruitment) హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. నియామక ప్రక్రియపై స్టే విధించింది. నియామక ప్రక్రియలో భాగంగా నిర్వహించిన ఈవెంట్స్ లో ఎత్తు విషయంలో అన్యాయం జరిగిందని పలువురు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. గత నియామక పరీక్ష సమయంలో అర్హుత సాధించిన వారిని.. ఈ నియామక పరీక్ష సందర్భంగా అనర్హులుగా ప్రకటించడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. అభ్యర్థుల తరఫున ప్రముఖ న్యాయవాది జడ శ్రావణ్ వాదనలు వినిపించారు. నియామక పరీక్షను ఆపాలని కోరారు. దీంతో నియామక పరీక్షపై స్టే ఇచ్చింది న్యాయస్థానం. ఇది కూడా చదవండి: సివిల్స్ అభ్యర్థులకు ఓయూలో ఫ్రీ కోచింగ్.. అప్లికేషన్ లింక్ ఇదే ఏపీలో గతేడాది నవంబర్ లో మొత్తం 411 ఎస్ఐ ఉద్యోగాలకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందు కోసం 1,51,288 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రిలిమినరీ పరీక్ష అనంతరం 57,923 మంది ఫిజికల్ ఈవెంట్స్ కు అర్హత సాధించారు. అయితే ఈవెంట్స్ లో డిజిటల్ మీటర్ ద్వారా ఛాతీ, ఎత్తును లెక్కించింది రిక్రూట్మెంట్ బోర్డు. ఇది కూడా చదవండి: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. డిగ్రీ అర్హతతో SBIలో 8773 జాబ్స్.. నేటినుంచే దరఖాస్తులు ఈ విధానంతో తాము అనర్హుతకు గురయ్యామని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఇందుకు సంబంధించిన మెయిన్స్ పరీక్షలను సైతం అక్టోబర్ 14, 15 తేదీల్లో నిర్వహించారు. అప్పుడు నియామకాలపై హైకోర్టు స్టే విధించడంతో ఆయా అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. #ap-police-jobs #ssc-si-jobs #ap-govt-jobs మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి