13వ గేటు వరకు హక్కు ఏపీదే..తగ్గేదేలే: మంత్రి అంబటి.!

సాగర్ కుడి కెనాల్‌ను తెలంగాణ ఆపరేట్ చేయడం చట్టవిరుద్ధమన్నారు మంత్రి అంబటి రాంబాబు. ఏపీ వాటా నీటిని విడుదల చేయాలన్నా తెలంగాణ పర్మిషన్ తీసుకోవాలా అని ప్రశ్నించారు. 13వ గేటు వరకు హక్కు ఏపీదేనన్నారు.

New Update
Andhra Pradesh: పవన్‌కు అది అలవాటే.. మంత్రి అంబటి సెన్సేషనల్ కామెంట్స్..!

Minister Ambati Rambabu: నాగార్జున సాగర్ డ్యామ్ లో 13వ గేటు వరకు ఏపీకి హక్కు ఉందని తేల్చిచెప్పారు ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు. సారగ్ కుడి కెనాల్ నుండి నీటిని విడుదల చేయటం.. ఏపీ ప్రభుత్వం చేసిన చర్య న్యాయమైనది..ధర్మమైనదని అన్నారు. తెలంగాణ పోలింగ్ రోజున.. ఒక పార్టీకి లబ్ధికలిగేలా  కావాలనే జగన్ ఇదంతా చేయించారని కొంతమంది ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.  తెలంగాణలో ఒక పార్టీని గెలిపించాల్సిన, ఓడించాల్పిన అవసరం తమకు లేదని కామెంట్స్ చేశారు.

Also Read: గెలుపు సర్టిఫికేట్ తీసుకోగానే ఎమ్మెల్యేలు కర్ణాటకకు.. బెంగళూరులో కాంగ్రెస్ క్యాంప్?

సాగర్ కుడి కెనాల్ ను కూడా తెలంగాణ ఆపరేట్ చేయడం చట్టవిరుద్ధమని ఖండించారు. మన భూభాగంలోకి మన పోలీసులు, అధికారులు వెళ్తే దండయాత్ర ఎలా అవుతుందని ప్రశ్నించారు. సాగర్ పై ఏపీ పోలీసుల దండయాత్ర అపి దుష్ప్రచారం చేశారని ఫైర్ అయ్యారు. మన వాటా నీటిని విడుదల చేయాలన్నా..తెలంగాణ పర్మిషన్ తీసుకోవాలా? మా వాటాను మేము వాడుకునే స్వేచ్ఛ కూడా మాకు లేదా? తెలంగాణ దయతో ఏపీ లో రైతులకు నీళ్లు ఇవ్వాలా?..  అని ప్రశ్నించారు. మా వాటాను మేము వాడుకునే స్వేచ్ఛ మాకు కావాలని వ్యాఖ్యనించారు. ఏపీ వాటాకు మించి ఒక్క నీటిబొట్టును కూడా వాడుకోలేదని స్పష్టం చేశారు. ఈ అన్యాయం సరిదిద్దటం తప్పా? అని అన్నారు. ఇది చాలా సున్నితమైన అంశం అని..మాకు గొడవలు అవసరం లేదని ఘటుగా స్పందించారు.

కృష్ణనది నీటి పంపకాల విషయంలో కృష్ణా రివర్ బోర్డు కి అప్పగించమని కేంద్రం కోరిన తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకోలేదని..నిన్న కిషన్ రెడ్డికి కూడా ఇదే విషయాన్ని చెప్పారని అన్నారు. తెలంగాణ ప్రజలకు కూడా నిన్నజరిగిన దాంట్లో వాస్తవాలు తెలుసుకోవాలని కోరారు. చట్టపరంగా ఏపీ పరిధిలో ఉండాల్సిన 13వ గేట్ నిర్వాహణ తెలంగాణ తీసుకుందని వ్యాఖ్యనించారు.

తెలంగాణ ప్రభుత్వం ఏపీ భూభాగంలో చెక్ పోస్ట్ లు పెట్టిందని..దీనికి కారణం చంద్రబాబు ప్రభుత్వం హయాంలో తీసుకున్న నిర్ణయాలేనని ధ్వజమెత్తారు. సాగర్ నీటి విషయంలో చంద్రబాబు ఫెయిల్ అయ్యారని విమర్శించారు.. ఏపీ భూభాగంలో ఉన్న ప్రాంతంలోకీ మాత్రేమే వెళ్ళామని అన్నారు.  మా హక్కుల్లో వేలు పెట్టడానికి తెలంగాణ ప్రయత్నిస్తుందన్నారు. ఇప్పుడు జగన్ తీసుకున్న నిర్ణయాలతో మన హక్కులు మనం సాదించుకున్నామని ధీమ వ్యక్తం చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు