Andhra Pradesh : ఏపీలో మళ్లీ చంద్రన్న కానుకలు!

ఏపీ లోని పేద ప్రజలకు పండుగల సమయంలో ఇచ్చే చంద్రన్న కానుకను మరోసారి రాష్ట్ర ప్రజలకు అందించేందుకు కూటమి సర్కార్ రెడీ అవుతోంది. చంద్రన్న సంక్రాంతి కానుక, క్రిస్మస్‌ కానుక, చంద్రన్న రంజాన్‌ తోఫా ను మరోసారి అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. గత వైసీపీ ప్రభుత్వం ఈ పథకాలను ఆపింది.

New Update
Andhra Pradesh : ఏపీలో మళ్లీ చంద్రన్న కానుకలు!

Chandranna Kanukalu : కూటమి ప్రభుత్వం (NDA Government) లో మరోసారి చంద్రన్న కానుకలు ఇచ్చేందుకు రెడీ అవుతోంది. గతంలోనూ టీడీపీ (TDP) ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసిన సంగతి తెలిసిందే. ఈ చంద్రన్న కానుక సంక్రాంతి, క్రిస్మస్, రంజాన్‌ తోఫా వంటి పేర్లతో వీటిని అందించింది. అయితే ఆ తరువాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం వాటిని నిలిపేసింది.

తాజాగా, ఇప్పుడు మళ్లీ ఆ కానుకలను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకాలను పునరుద్ధరించేందుకు పౌరసరఫరాలశాఖ కసరత్తు మొదలు పెట్టింది. పేదలకు పంపిణీ చేసే ఈ కానుకల కోసం ప్రభుత్వం సంవత్సరానికి రూ. 538 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన ఐదేళ్లకు రూ. 2,690 కోట్ల అదనపు భారం ప్రభుత్వంపై పడనుందని సమాచారం.

ఈ పథకం కింద సంక్రాంతి , క్రిస్మస్ లకు అందజేసే కానుకలో అరకేజీ కందిపప్పు, అరకేజీ శనగపప్పు, అరకిలో బెల్లం, అర లీటరు పామాయిల్, కిలో గోధుమపిండి,100 గ్రాముల నెయ్యితో కూడిన కిట్లను కార్డుదారులకు అందిస్తారు. అయితే, రంజాన్ తోఫాలో మాత్రం 2 కేజీల పంచదార, 5 కేజీల గోధుమపిండి, కేజీ సేమ్యా, 100 గ్రాముల నెయ్యి కూడా అందిస్తారు. అలాగే, రెగ్యులర్ కోటా కింద రేషన్‌కార్డు (Ration Card) దారులకు ఉచిత బియ్యంతోపాటు పంచదార, కందిపప్పు, గోధుమపిండి, జొన్నలు, సజ్జలు కూడా అందించాలని ప్రభుత్వం భావిస్తుంది.

Also Read: ఉత్తర కొరియాకు మేకలిచ్చిన రష్యా… ఎందుకో తెలుసా!

Advertisment
Advertisment
తాజా కథనాలు