AP Pensions: పెన్షన్ల పంపిణీపై కీలక ప్రకటన AP: పెన్షన్ల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 1న బ్యాంకు ఖాతా ఉన్నవాళ్లకు డీబీటీ ద్వారా వల్ల అకౌంట్లోనే పెన్షన్ నగదును జమ చేయనుంది. బ్యాంకు ఖాతా లేనివారికి ఇంటి వద్దకే వచ్చి పెన్షన్లు ఇవ్వనుంది. పెన్షన్ల కోసం సచివాలయానికి రావద్దని కోరింది. By V.J Reddy 28 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ విజయనగరం New Update షేర్ చేయండి AP Pensions: పెన్షన్ల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు రాష్ట్రంలో పెన్షన్ దారులకు పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. లబ్దిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలతో విధివిధానాల్లో మార్పులు చేసింది. ఈరోజు అన్ని జిల్లాల కలెక్టర్లతో పంచాయతీ రాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ALSO READ: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డిపై ఈసీకి ఫిర్యాదు పెన్షన్ల పంపిణీ ప్రక్రియపై వారికి కీలక సూచనలు చేశారు. పెన్షన్ల కోసం సచివాలయానికి రావాల్సిన అవసరం లేదని అన్నారు. మే 1న బ్యాంకు ఖాతా ఉన్న లబ్దిదారులకు డీబీటీ ద్వారా వల్ల అకౌంట్లోనే నగదు జమ చేయనున్నట్లు ఆయన తెలిపారు. బ్యాంకు ఖాతా లేనివారికి, దివ్యాంగులకు ఇంటి వద్దకే వచ్చి పెన్షన్లు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. పెన్షన్ల కోసం సచివాలయానికి రావద్దని కోరారు. మే 5వ తేదీ వరకు బ్యాంకు ఖాతా లేని వారి ఇంటి వద్దకకే సచివాలయ ఉద్యోగులు వచ్చి పెన్షన్ సొమ్మును మీకు అందిస్తారని అన్నారు. #cm-jagan #ap-latest-news #ap-pension-s మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి