Jagan: మాజీ సీఎం జగన్‌కు చంద్రబాబు సర్కార్ షాక్

AP: జగన్‌కు ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ప్రజాధనంతో కొన్న ఫర్నీచర్, ఎలక్ట్రికల్ వస్తువులు వెంటనే అప్పగించాలని జగన్‌కు సాధారణ పరిపాలనశాఖ అధికారులు లేఖ రాశారు. కాగా దీనిపై జగన్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

New Update
Jagan: మాజీ సీఎం జగన్‌కు చంద్రబాబు సర్కార్ షాక్

Jagan: మాజీ సీఎం జగన్‌కు ఏపీ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ప్రజాధనంతో కొన్న ఫర్నీచర్, ఎలక్ట్రికల్ వస్తువులు వెంటనే అప్పగించాలని జగన్‌కు సాధారణ పరిపాలనశాఖ అధికారులు లేఖ రాశారు. సీఎంగా ఉన్నప్పుడు తాడేపల్లిలోని తన నివాసాన్నే క్యాంపు కార్యాలయంగా జగన్ మార్చుకున్నారు. పదవి నుంచి దిగిపోయిన 15 రోజుల్లోగా ప్రభుత్వానికి ఆస్తులు అప్పగించాలనే నిబంధన ఉంది. కాగా ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి.. జగన్ సీఎం కుర్చీ పోయినా ఇంకా ఆ ఫర్నిచర్ ఇవ్వకపోవడంతో ప్రభుత్వ అధికారులు నోటీసులు ఇచ్చారు.

ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో టీడీపీ, జనసేన శ్రేణులు ఫర్నిచర్ దొంగ జగన్ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిపై వైసీపీ సోషల్ మీడియా స్పందించింది. ఫర్నిచర్ కు ఎంత డబ్బు అవుతుందో చెప్పాలని.. ఆ డబ్బును వైసీపీ అధినేత జగన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొంది. తమకు డబ్బు వద్దని ప్రజా ధనం తో కొన్న ఆ ఫర్నిచర్ ను ప్రభుత్వాన్ని అప్పజెప్పాలని అధికారులు జగన్ కు నోటీసులు ఇచ్చారు. మరో జగన్ ఆ ఫర్నిచర్ ఇస్తారా? లేదా? అనే ఉత్కంఠ ఏపీ రాజకీయాల్లో నెలకొంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు