AP Game Changer: అనంతపురంలో ఆ పార్టీదే హవా.. నియోజకవర్గాల వారీగా రవిప్రకాష్ చెప్పిన లెక్కలివే!

ఈ ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో ఏ పార్టీ ఎన్ని అసెంబ్లీ సీట్లను గెలుచుకుంటుంది? బాలయ్య హ్యాట్రిక్ కొడతారా? పరిటాల సునీత ఈ సారైన విజయం సాధిస్తారా? తాడిపత్రిలో గెలుపు ఎవరిది?.. రవిప్రకాష్ చెప్పిన ఆర్టీవీ స్టడీ వివరాలు ఇలా ఉన్నాయి.

New Update
AP Game Changer: అనంతపురంలో ఆ పార్టీదే హవా.. నియోజకవర్గాల వారీగా రవిప్రకాష్ చెప్పిన లెక్కలివే!

AP Elections 2024 Survey By Ravi Prakash: అనంతపురం జిల్లాలో 14 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇందులో అత్యంత కీలకం తాడిపత్రి. టీడీపీ నుంచి జేసీ వారసుడు అస్మిత్‌ రెడ్డి , వైసీపీ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే పెద్దారెడ్డి పోటీ చేస్తున్నారు. తాడిపత్రి మున్సిపాల్టీలో సమస్యలనే టీడీపీ ఆయుధంగా మార్చుకుంటోంది. ఫైనల్‌గా ఇక్కడ విజయం వైసీపీ వైపే ఉండే అవకాశం ఉందని ఆర్టీవీ స్టడీలో తేలింది.

రాప్తాడులో..
అనంతపురంలో జిల్లాలో మరో హాట్ సీట్ రాప్తాడు. పరిటాల సునీత మరోసారి ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆమెకు సిట్టింగ్‌ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌ రెడ్డి గట్టి పోటీ ఇస్తున్నారు. ప్రకాశ్‌ రెడ్డికి నియోజకవర్గంలోని 5 మండలాల్లో మంచి పట్టు వుంది. సునీతకు కేవలం తన సొంత మండలమైన రామగిరితోపాటు కనగాన పల్లిలోనే బలం ఉంది. ఈ నేపథ్యంలో.. రాప్తాడు వైసీపీ వశమయ్యే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయి.

rapthadu

మడకశిరలో కాంగ్రెస్..
అనంతపురం జిల్లాలో మడకశిర నియోజకవర్గాన్ని కాంగ్రెస్‌ దక్కించుకునే సంకేతాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే పదేళ్ళ తర్వాత కాంగ్రెస్‌ పార్టీ పునర్వైభవం దిశగా తొలి అడుగు వేసినట్లే. మాజీ మంత్రి రఘువీరారెడ్డి ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, 340 గ్రామాల్లో విస్తృతంగా తిరగడం కాంగ్రెస్‌ పార్టీకి ప్లస్‌గా మారింది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి సుధాకర్ గెలిచే అవకాశాలు ఉన్నాయి.

AP Elections 2024 Survey By Ravi Prakash

బాలయ్యకు మళ్లీ ఛాన్స్?
నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం ఎక్కువ మంది దృష్టిని ఆకర్షిస్తోంది. 2014, 2019లో వరుసగా గెలిచి.. మూడోసారి బరిలోకి దిగిన బాలకృష్ణపై టీఎన్‌ దీపికను పోటీకి దింపారు వైఎస్‌ జగన్‌. అయితే.. హిందూపురం ఓటర్ల నాడి చూస్తే మరోసారి టీడీపీకే పట్టం కట్టి.. బాలకృష్ణను అసెంబ్లీకి పంపే అవకాశం ఉందని ఆర్టీవీ స్టడీలో తేలింది.

AP Elections 2024 Survey By Ravi Prakash

ఇంకా రాయదుర్గంలో టీడీపీ అభ్యర్థి కాలువ శ్రీనివాసులు, ఉరవకొండలో టీడీపీ అభ్యర్థి పయ్యావుల కేశవ్, గుంతకల్ లో టీడీపీ అభ్యర్థి గుమ్మనూరు జయరాం, సింగనమలలో టీడీపీ అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ, అనంతపురం అనంత వెంకటరామిరెడ్డి, కల్యాణదుర్గంలో టీడీపీ అభ్యర్థి సురేంద్రబాబు, పెనుగొండలో టీడీపీ అభ్యర్థి సవితమ్మ, పుట్టపర్తిలో వైసీపీ అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, ధర్మవరంలో వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకట రామిరెడ్డి, కదిరిలో టీడీపీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ విజయం సాధించే అవకాశాలు ఉన్నట్లు ఆర్టీవీ స్టడీలో తేలింది.

publive-image

Advertisment
Advertisment
తాజా కథనాలు