AP Ex Minister Narayana: మాజీ మంత్రి నారాయణకు హైకోర్టులో షాక్.. నాట్ బిఫోర్ మీ అన్న జడ్జి..

ఏపీ ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ నోటీసుపై మాజీ మంత్రి నారాయణ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. నారాయణ పిటిషన్ విచారణ నుంచి న్యాయమూర్తి శ్రీనివాస్ రెడ్డి తప్పుకున్నారు. దీంతో విచారణను ఏసీబీ కోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది.

New Update
AP High Court: మాజీ మంత్రి నారాయణకు ఏపీ హైకోర్టులో స్వల్ప ఊరట

AP Ex Minister Narayana: ఏపీ ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ నోటీసుపై మాజీ మంత్రి నారాయణ (AP Ex Minister Narayana) దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై ఈ రోజు హైకోర్టులో (AP High Court) విచారణ జరిగింది. ఈ విచారణను వేరే బెంచ్ కు బదిలీ చేయాలని న్యాయమూర్తి సూచించారు. నారాయణ పిటిషన్ విచారణ నుంచి న్యాయమూర్తి శ్రీనివాస్ రెడ్డి తప్పుకున్నారు. దీంతో విచారణను ఏసీబీ కోర్టు ఎల్లుండికి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే.. రేపు విచారణకు రావాలని నారాయణకు ఇప్పటికే సీఐడీ (AP CID) నోటీసులు జారీ చేసింది. విచారణ ఎల్లుండికి వాయిదా పడడంతో రేపు నారాయణకు సీఐడీ విచారణకు హాజరుకావాల్సిన పరిస్థితి ఏర్పడింది. రేపు నారాయణను రేపు అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
ఇది కూడా చదవండి: Chandrababu Lawyers Fee: చంద్రబాబు కోసం రంగంలోని ముగ్గురు దిగ్గజ లాయర్లు.. వారి ఫీజు ఎంతో తెలుసా?

ఇదిలా ఉంటే.. ఇదే కేసులో నారా లోకేష్‌ కు నిన్న ఏపీ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఈ నెల 4వ తేదీకి బదులుగా ఈ నెల 10న సీఐడీ (AP CID) విచారణకు హాజరు కావాలని కోర్టు తెలిపింది. ఈ మేరకు సీఐడీకి ఏపీ హైకోర్టు (AP High Court) ఆదేశాలు జారీ చేసింది. సీఐడీ ఇటీవల తనకు జారీ చేసిన 41 ఏ నోటీసులోని నిబంధనలను హైకోర్టులో లోకేష్ (Lokesh) సవాల్ చేశారు. లోకేష్‌ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. లోకేష్ ప్రస్తుతం హెరిటేజ్ లో షేర్ హోల్డర్ అని చెప్పిన లోకేష్ తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. ఆయనకు తీర్మానాలు, బ్యాంక్ అకౌంట్ పుస్తకాలు ఇవ్వాలంటే కంపెనీ ప్రొసీజర్ ఉంటుందని వారు వివరించారు. లోకేష్ ను ఇవి అడగడం సమంజసం కాదని న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు తన వాదనలు వినిపించారు.

తాము డాక్యుమెంట్ల పై ఒత్తిడి చేయబోమని, రేపే విచారణకు హాజరు కావాలని సీఐడీ తరఫు న్యాయవాదులు తెలిపారు. అంత తొందర ఏముందని లోకేష్ తరఫు న్యాయవాది పోసాని ప్రశ్నించారు. ఇరువర్గాల వాదనల అనంతరం ఈ నెల 10వ తేదీన నారా లోకేష్ విచారణకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 10వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ మాత్రమే విచారణ చేయాలని కోర్టు ఆదేశించింది. న్యాయవాదిని కూడా అనుమతించాలని కూడా ఆదేశాల్లో పేర్కొంది. విచారణ సమయంలో మధ్యాహ్నం గంట పాటు లంచ్ బ్రేక్ ఇవ్వాలని సీఐడీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Inter Supplementary Exams : ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్.. ఫీజు చెల్లింపునకు తుది గడువు ఇదే

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ ఫలితాలను మంత్రి నారా లోకేష్‌ విడుదల చేశారు. ఇంటర్ ఫస్ట్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి రిలీజ్ చేశారు. ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఇంటర్ బోర్డు అధికారులు ముఖ్య ప్రకటన చేశారు.  

New Update
Inter Supplementary Exams

Inter Supplementary Exams

Inter Supplementary Exams:  ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్‌ ఫలితాలను మంత్రి నారా లోకేష్‌ విడుదల చేశారు. ఇంటర్ ఫస్ట్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి రిలీజ్ చేశారు. కాగా ఇంటర్‌ ఫలితాల్లో గణనీయమైన ఉత్తీర్ణత సాధించింది. గతం కంటే అత్యధిక శాతం ఉత్తీర్ణత నమోదు అయినట్లు ఆధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం ఇంటర్మీడియట్‌ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలపై ఇంటర్ బోర్డు అధికారులు ముఖ్య ప్రకటన చేశారు.  


 Also Read :  తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా!
 
మే 12 నుంచి ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. మే 12 నుంచి 20 వరకు పరీక్షలు జరుగుతాయని ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు తెలిపారు. కాగా ఫేయిలై విద్యార్థులు సబ్జెక్టులను బట్టి  ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఫెయిల్ అయిన విద్యార్థులు ఏప్రిల్ 15 వరకు సప్లెమెంటరీ పరీక్షల కోసం ఫీజు చెల్లించాల్సిందిగా బోర్డు తెలిపింది. ఏప్రిల్ 22 వరకు చివరి తేదీగా ప్రకటించింది. అలాగే సప్లిమెంటరీ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు జరుగనున్నాయి.  

Also Read: కొరియోగ్రాఫర్ శ్రష్ఠి వర్మ బ్రాండ్ న్యూ కార్ అదుర్స్..!


ఈరోజు (శనివారం) ఉదయం సోషల్ మీడియా ఎక్స్‌ వేదికగా మంత్రి నారా లోకేష్  ఏపీ ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. ఈసారి అత్యధికంగా పాస్‌ పర్సంటేజ్ నమోదు అవడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 70 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా.. రెండో సంవత్సరంలో 83 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత పొందారు. ప్రతీఏడు లాగే ఈ ఏడాది కూడా ఇంటర్ ఫలితాల్లో బాలికదే పై చేయిగా నిలిచింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో బాలికలు 71 శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలురు 64 శాతం ఉత్తీర్ణత పొందారు. అలాగే ఇంటర్ సెకండ్ ఇయర్‌లో 81 శాతంతో బాలికలు ఉత్తీర్ణత పొందగా.. బాలురు 75 శాతం ఉత్తీర్ణత సాధించారు.

Chiranjeevi: డ్యాన్స్ చేస్తూ కళ్ళు తిరిగి పడిపోయిన చిరంజీవి..!

Also Read :  అనుకున్నదే అయింది.. అఘోరీకి వర్షిణీకి పెళ్లైంది - వీడియో

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు