Nara Lokesh: అందరిని గుర్తుపెట్టుకుంటాం.. వైసీపీ నేతలకు లోకేష్ హెచ్చరికలు ఓటమి భయంతో వైసీపీ నాయకులు టీడీపీ ముఖ్యనేతలపై దాడికి దిగుతున్నారని లోకేష్ మండిపడ్డారు. జగన్ గొడ్డలితో తెగబడితే, వైసీపీ కార్యకర్తలు వేటకొడవళ్లతో జనాల్ని వేటాడుతున్నారని ఫైర్ అయ్యారు. దాడి చేసే నాయకులందరినీ గుర్తుపెట్టుకుంటామని హెచ్చరించారు. By V.J Reddy 25 Mar 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి Nara Lokesh: మరికొన్ని రోజుల్లో ఏపీలో ఎన్నికలు సంపిస్తున్న వేళ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. విమర్శలు, ప్రతివిమర్శలతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. తాజాగా సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వం విమర్శల దాడికి దిగారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఐదేళ్లుగా జగన్ సాగించిన ఆటవిక పాలన, ఎన్నికల కోడ్ వచ్చాక కూడా కొనసాగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని అన్నారు. వైసీపీ అధినేత జగన్ గొడ్డలితో తెగబడితే, వైసీపీ కార్యకర్తలు వేటకొడవళ్లతో జనాల్ని వేటాడుతున్నారని ఫైర్ అయ్యారు. ALSO READ: 18 మందితో జనసేన అభ్యర్థుల ప్రకటన పోలీసులు ఎక్కడ? ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించారు లోకేష్. శ్రీసత్యసాయి జిల్లా నల్లమాడ మండలం కుటాలపల్లిలో టీడీపీ కార్యకర్త అమర్నాథరెడ్డి హత్యని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. ఇది ముమ్మాటికీ వైసీపీ సైకోల పనే అని ఆరోపించారు. ఓటమి భయంతో టీడీపీలో క్రియాశీలక కార్యకర్తల్ని అంతమొందిస్తున్నారని విమర్శించారు. అధికారం అండతో చెలరేగుతున్న వైసీపీ కాలకేయులకు ఇదే నా హెచ్చరిక అని పేర్కొన్నారు. మీకు రోజులు దగ్గరపడ్డాయని అన్నారు. జగన్ రెడ్డి ముఠాని నమ్ముకుని హత్యలకు పాల్పడితే.. మిమ్మల్ని ఎవ్వడూ కాపాడలేడని అన్నారు. కావాలనే నన్ను ఆపుతున్నారు.. ఎన్నికల కోడ్ అమల్లో ఉందని తన కాన్వాయ్ నాలుగు సార్లు తనిఖీ చేసిన పోలీసులు.. ఇదే రోడ్డులో తిరిగే సీఎం, వైసీపీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల వాహనాలు ఎందుకు తనిఖీ చేయడం లేదని పోలీస్ అధికారులను ప్రశ్నించారు లోకేష్. చట్టం అందరికీ సమానంగా అమలు చేయాలి కదా! అని అన్నారు. తనను టార్గెట్ చేసి వేధిస్తున్న పోలీసుల తీరుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. మరికొన్ని రోజుల్లో ఏపీలో తమ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని.. అప్పుడు తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలి పెట్టేది లేదని లోకేష్ హెచ్చరించారు. జగన్ అండ చూసుకొని కొందరు పోలీస్ అధికారులు రెచ్చిపోతున్నారని విమర్శించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉంటే అధికార వైసీపీ నేతల కార్లను కూడా ఆపి తనిఖీ చేయాలని పోలీసులను కోరారు. #nara-lokesh #tdp #ap-elections-2024 #cm-jagan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి