Pawan Kalyan: సీఎం కాదు లిక్కర్ వ్యాపారి.. జగన్‌పై పవన్ చురకలు అనకాపల్లి పర్యటనలో సీఎం జగన్‌పై విమర్శలు గుప్పించారు పవన్ కళ్యాణ్. అమ్మఒడి పథకం కింద అమ్మలకు రూ.19,600 కోట్లు ఇచ్చి.. మద్యం మీద నాన్నల దగ్గరి నుంచి లక్ష కోట్లు దోచుకున్నారని ఫైర్ అయ్యారు. జగన్ ముఖ్యమంత్రి కాదు..మద్యం వ్యాపారిలా మారారని ఎద్దేవా చేశారు. By V.J Reddy 07 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ వైజాగ్ New Update షేర్ చేయండి Janasena Chief Pawan Kalyan: ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో వరుస పర్యటనలతో బిజీగా గడుపుతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈరోజు అనకాపల్లి నియోజకవర్గంలో పర్యటించారు. రోడ్ షో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ... ఎంపిగా సీఎం రమేష్, అసెంబ్లీ నుంచి కొణతాల, పెందుర్తి నుంచి పంచకర్ల రమేష్ లతో పాటు, టీడీపీ అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరారు. నుకాలమ్మ తల్లి సాక్షిగా ఈ రోజు సభ జరుగుతుంది తెలంగాణ సమ్మక్క, సారక్క జాతర ఇక్కడ ఉందని.. అనకాపల్లి నుకలమ్మ జాతరను రాష్ట్ర ప్రభుత్వ జాతరగా చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఒకప్పుడు అనకాపల్లిలో బెల్లం గురించి వినిపించేది.. ఇప్పుడు అనకాపల్లిలో వైసీపీ కోడి గుడ్డు వినిపిస్తుందని వ్యాఖ్యానించారు. యువత, ఆడపడుచులు, పెద్దలు తమకు ఇస్తున్న మద్దతు చూస్తుంటే వైసీపీ పోవాలని ప్రజలు ఎంతగా కోరుకుంటున్నారో అర్దం అవుతుందని అన్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలనే పొత్తులు పెట్టుకున్నామని అన్నారు. దశాబ్ద కాలం ఒక్క ఎమ్మెల్యే లేకుండా పార్టీని నడప గలిగానని అన్నారు. మీ భవిష్యత్ కోసం పోరాడారు, నా సొంత ప్రయోజనాలు చూసుకుంటే ఇప్పటికే ఎన్నో పదవులు అందివచ్చేవని పేర్కొన్నారు. Also Read: హమ్మయ్య..మొత్తానికి జేపీ నడ్డా భార్య కారు దొరికింది..అసలేం జరిగిందంటే! వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి పథకం పెట్టినపుడు 15 వేలు ఇస్తాం అన్నారు, రెండో ఏడాదికి వెయ్యి రూపాయలు వేశారు.. మూడో ఏడాదికి వచ్చేసరికి ఇంకా కోతలు పెట్టారని మండిపడ్డారు. అమ్మఒడి ద్వారా అమ్మలకు రూ.19, 600 కోట్లు ఇచ్చి మద్యం మీద నాన్న దగ్గరి నుంచి లక్ష కోట్లు దోచుకున్నారని ఫైర్ అయ్యారు. జగన్ ముఖ్యమంత్రి కాదు..మద్యం వ్యాపారిలా మారారని అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ సూపర్ సిక్స్ హామీలు తో ముందుకు వెళ్తున్నామని అన్నారు. #pawan-kalyan #ap-elections-2024 #cm-jagan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి