Nara Lokesh: జగన్‌కి హైకోర్టు తీర్పు చెంపపెట్టు.. గ్రూప్-1 రద్దుపై లోకేష్ రియాక్షన్

2018 గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను హైకోర్టు రద్దు చేయడంపై స్పందించారు లోకేష్. APPSCని భ్రష్టు పట్టించిన జగన్‌కి హైకోర్టు తీర్పు చెంపపెట్టు అని అన్నారు. త్వ‌ర‌లో ప్రజా ప్ర‌భుత్వం ఏర్పడుతుందని.. కోర్టు ఆదేశాల మేరకు పార‌ద‌ర్శ‌కంగా ప్ర‌భుత్వ ఉద్యోగాల‌న్నీ భ‌ర్తీ చేస్తామన్నారు.

New Update
Lokesh: నారా లోకేష్ ఫోన్ హ్యాక్!.. ఈసీకి ఫిర్యాదు

Nara Lokesh On APPSC Group 1 : ఏపీలో 2018లో గ్రూప్‌-1 మెయిన్ పరీక్షను రద్దు చేస్తూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ స్పందించారు. ఏపీపీఎస్సీని భ్రష్టు పట్టించిన జగన్‌కి హైకోర్టు తీర్పు చెంపపెట్టు అని మండిపడ్డారు. ఏపీపీఎస్సీని జగన్ (CM Jagan) వైసీపీఎస్సీగా మార్చేసి పూర్తిగా భ్రష్టు పట్టించారని ఫైర్ అయ్యారు. టీడీపీ హయాంలో 169 గ్రూప్‌-1 ఉద్యోగాల భ‌ర్తీకి 2018లో నోటిఫికేషన్ ఇచ్చామని గుర్తు చేశారు. అధికారంలోకి వ‌చ్చిన వైసీపీ, గ్రూప్ 1 మెయిన్స్ ప‌రీక్ష‌ల నిర్వహణ, మూల్యాంక‌నంలో అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డిందని ఆరోపించారు.

ALSO READ: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కిడ్నాప్.. క్లారిటీ!

నిరుద్యోగుల ఉసురు పోసుకున్నారు..

గ్రూప్-1 మూల్యాంకనంలో అవ‌క‌త‌వ‌క‌ల‌ను నిర్ధారిస్తూ మెయిన్స్ ను రద్దు (Group 1 Mains Cancelled) చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని అన్నారు లోకేష్. ప్ర‌తిప‌క్ష‌నేత‌గా జ‌గ‌న్ 2.30 ల‌క్ష‌లకు పైగా ప్ర‌భుత్వ ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తాన‌ని, ప్ర‌తి ఏటా జ‌న‌వ‌రి 1నే ప్ర‌భుత్వ ఉద్యోగాల ఖాళీల వివ‌రాల‌తో జాబ్ క్యాలెండ‌ర్ విడుద‌ల చేస్తాన‌ని హామీ ఇచ్చి విస్మ‌రించారని మండిపడ్డారు. చివ‌రికి గ్రూప్-1 పేప‌ర్ల వాల్యూయేష‌న్‌ని ఇష్టారాజ్యంగా నిర్వ‌హించి నిరుద్యోగుల ఉసురు పోసుకున్నారని ధ్వజమెత్తారు. ఇప్పుడు కోర్టు తీర్పు వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి చెంపపెట్టు అని అన్నారు. ప్ర‌జాఆకాంక్ష‌ల మేర‌కు త్వ‌ర‌లో ప్రజా ప్ర‌భుత్వం ఏర్పడుతుంది కోర్టు ఆదేశాల మేరకు పార‌ద‌ర్శ‌కంగా ప్ర‌భుత్వ ఉద్యోగాల‌న్నీ భ‌ర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.

అసలేం జరిగిందంటే...

2018 లో నిర్వహించిన గ్రూప్‌-1 మెయిన్స్‌(Group-1 Mains) ను ఏపీ హైకోర్టు రద్దు చేసింది. ప్రశ్నపత్రాల డిజిటల్‌ వాల్యుయేషన్‌(Digital Valuation) పై పలువురు అభ్యర్థులు ఏపీ హైకోర్టు(AP High Court) ను ఆశ్రయించారు. ఈ పరీక్షను తిరిగి 6 నెలల్లో నిర్వహించాలని ఏపీ హైకోర్టు చెప్పింది. 

జులై 22, 2022లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2018 గ్రూప్-1 పరీక్షల ఫలితాలను ప్రకటించింది. అయితే ఆ తర్వాత డిజిటల్‌ వాల్యుయేషన్‌పై ఏపీ హైకోర్టులో పలువురు అభ్యర్థులు పిటిషన్‌ వేశారు. దీంతో గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష ఫలితాలను నిలిపివేశారు. జవాబు పత్రాల మాన్యువల్ మూల్యాంకనానికి తిరిగి రావాలని APPSCని కోర్టు ఆదేశించింది. తాజాగా ఈ పరీక్షను రద్దు చేసిన ఏపీ హైకోర్టు మరో 6 నెలల్లో ఎగ్జామ్‌ పెట్టాలని చెప్పింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు